మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : ఆఖరి యుద్ధానికి పోలీస్, మావోయిస్టులు కర్రె గుట్ట్టలను వే దికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు వర్గా లు మోహరించి ఉండడంతో ఎప్పుడేం జరుగుతుందో టె న్షన్ టెన్షన్‌గా ఉంది. కర్రెగుట్టల్లో మందుపాతరలు ఉ న్నట్లు మావోయిస్టులు ప్రకటించిన పది రోజుల తరువా త ఈ భారీ పరిణామం జరగడం సంచలనం రేకెత్తిస్తోం ది. మంగళవారం ఉదయం నుండి పోలీసు బలగా లు ఐదు రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో తరలివచ్చి గుట్ట ల చుట్టూ మోహరించి ఉన్నారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి కి చేరుకోవడంతో నక్సలైట్లు కర్రె గుట్టపై ఉన్నా రా? లేరా? అనే దానిపై అన్ని రాష్ట్రాలు అలర్ట్ అ య్యాయి.
ఎత్తైన కొండలతో విస్తృతమైన పరిధి లో విస్తరించిన కర్రె గుట్టలు అన్నివైపులా 70 నుండి 100 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉ న్నాయి. మావోయిస్టు పార్టీలో మోస్ట్ వాంటెడ్ గా పేరుగాంచిన హిడ్మా స్వస్థలం చేరుకొని ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలపై సొరంగ మార్గంతో పాటు 500 నుండి 1000 మంది వరకు ఒక బండరాయి గుహలో ఉండేందుకు అనువుగా ఉంటుంది. కర్రెగుట్టలపై 500 ఎకరాల వరకు విస్తారంగా సమాన స్థాయిలో భూమి చదునుగా ఉంటుంది. పైగా గుట్ట నేరుగా ఎక్కడానికి అవకాశం లేకుండా ఒకటి రెండు చోట్ల నుండే గుట్ట పైకి వెళ్లాల్సి ఉంటుంది. అది కాకుండా గుట్టపైకి అడవుల నుండి వచ్చే రహస్య మార్గం కూడా ఉంది. ఆ మార్గం కొందరికే తెలిసి ఉండడంతో పోలీసు బలగాలు గుట్టపైకి నేరుగా చేరుకొనే ప్రయత్నం చేస్తే వారిని ఏకధాటిగా మట్టు పెట్టే అవకాశాలు మావోయిస్టులకు ఉంటుంది.
అబూజ్ మడును మించిన స్థావరం కర్రెగుట్టలు…
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ప్రధాన కేంద్ర స్థావరంగా అబూజ్మడ్ అడవులను భావించేవారు. దానికి భిన్నమైనదిగా కర్రె గుట్టలుగా ప్రస్తుతం భావిస్తున్నారు. కర్రె గుట్టలు ఎంతో సెక్యూరిటీ కలిగిన స్థావరంగా మావోయిస్టులు భావించడం వలన నేడు కర్రె గుట్టలపై మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. శత్రు దుర్భేద్యంగా ఉన్న కర్రె గుట్టలను ఛేదించడానికి గుట్టపైకి బలగాలు చెరుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఒకే మార్గం ద్వారా గుట్ట పైకి వెళ్లడానికి పోలీసులు జంకుతున్నారు. గుట్ట కింద నుండి పైకి వెళ్లాలంటే పైనుండి తూటాలు, బాంబుల వర్షం కురుస్తుందని పోలీస్ బలగాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపై ఉన్న మావోయిస్టులను అంతమొందించడానికి అత్యధునికమైన డ్రోన్ కెమెరాలు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. పోలీస్ బలగాల వద్ద ఉన్న అధునాతన ఆయుధాలు, ఏ మేరకు ఉన్నాయో మావోయిస్టుల వద్ద కూడా ఆ స్థాయిలోనే అధునాతన ఆయుధాలు సమాచార వ్యవస్థ రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్ బాంబులు, ఎకె 47 లాంటి రైఫిల్స్ ఉన్నాయి. హెలికాప్టర్ల ద్వారా దాడులు నిర్వహించే అవకాశం ఉంటే వాటిని నేరుగా కూల్చేందుకు కూడా మావోయిస్టులు వెనుకడుగు వేయని ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు కర్రెగుట్టలపై మోహరించి ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రజలను మోహరించిన మావోయిస్టులు…
పోలీస్ బలగాలను ఎదుర్కోవడానికి ఆఖరి యుద్ధానికి మావోయిస్టులు సిద్ధమైనప్పటికీ ప్రభుత్వంతో చర్చలకు తెరలేపి ఈ యుద్ధాన్ని ఆపేందుకు మావోయిస్టులు ఆదివాసులను భారీ ఎత్తున కర్రెగుట్ట పైకి రప్పించినట్లు తెలుస్తోంది. గుట్ట కింది భాగంలో పోలీసు బలగాలు ఉండగా గుట్ట మధ్య భాగంలో చుట్టుపక్కల గ్రామాల ఆదివాసీ ప్రజలను మోహరించారు. గుట్టపైన మావోయిస్టు నక్సలైట్లు ఉండగా ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పోలీసులు నేరుగా మావోయిస్టులపై దాడులకు దిగే సూచనలు కనిపిస్తే ప్రజలను అక్కడినుండి సురక్షిత ప్రాంతంలోకి తరలించి పోలీసుల పైకి నేరుగా ఎదురుదాడికి దిగేందుకు మావోయిస్టులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కర్రెగుట్టలను దిగ్బంధించిన ఆక్టోపస్ ….
తెలంగాణ చత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను ఆక్టోపస్ పోలీస్ బలగాలు దిగ్బందించారు. సోమవారం రాత్రి నుండి బుధవారం వరకు వేలాది సంఖ్యలో పోలీసు బలగాలు ఐదు రాష్ట్రాల నుండి తరలివచ్చి కర్రెగుట్టలను చుట్టుముట్టారు. గుట్టపైన మావోయిస్టులు భారీ ఎత్తున ఉన్నారన్న సమాచారం మేరకు వారిని నేరుగా అటాక్ చేసేందుకు పోలీసు బలగాలు చుట్టుముట్టారు. నక్సలైట్లు ఏ వైపు నుండి కూడా తప్పించుకోకుండా ఉండేందుకు గుట్ట చుట్టూ మోహరించి ఉండడం వల్ల ఎవరు కూడా తప్పించుకునే అవకాశాలు లేకుండా పోయాయి. దీనివల్ల మావోయిస్టులు క్లైమోర్ మైన్స్‌ను గుట్ట చుట్టూ పాతి పెట్టడం వల్ల పోలీసులు గుట్టపైకి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. మావోయిస్ట్‌లు భారీ ఎత్తున ఉన్నారన్న సమాచారం మేరకు తెలంగాణ, ఆంధ్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక పోలీస్ దళాలను ఆక్టోపస్ ఆధ్వర్యంలో కర్రె గుట్టలను చుట్టుముట్టడం అన్ని రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
కర్రెగుట్టలపై కేంద్ర కమిటీ నాయకులు….
కర్రె గుట్టలపై మావోయిస్ట్ పార్టీకి చెందిన 14 మంది కేంద్ర కమిటీ నాయకులు, మోస్ట్ వాంటెడ్ హిడ్మా, వివిధ ప్రాంతాలకు చెందిన దళాల నాయకులు సభ్యులు 200 మంది వరకు మోహరించి ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మావోయిస్ట్‌ల ఉనికిని కనిపెట్టి భారీ ఎత్తున తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అందుకుగాను చత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టులు సుముఖత వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు వర్గాలు కాల్పులకు పాల్పడకుండా ఉండేందుకు మధ్యవర్తులుగా పౌర హక్కుల సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.
మావోయిస్టులు చర్చలను కోరుకుంటున్నందున కర్రెగుట్టల వద్ద ఎలాంటి కాల్పులు, విధ్వంసం జరగకూడదని అలా జరిగితే వన్‌సైడ్ హింసను ఎత్తిచూపే అవకాశాలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొల్పులు మందుపాతరలు పేల్చడం లాంటిది చేయకూడదని కర్రగుట్టలో ఉన్న మావోయిస్టులకు ఆ పార్టీ అగ్ర నేతలు సూచించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు మాత్రం గుట్టల నుండి బయటపడేందుకు చుట్టూ ఉన్న గ్రామాల ఆదివాసీలను కర్రగుట్టల పైకి తీసుకొచ్చి గుట్ట మధ్యలో ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసు బలగాలు నేరుగా మావో యిస్టులనుఅటాక్ చేయాలంటే మధ్యలో ఉన్న వేలాది మంది ఆదివాసీలను దాటుకొని గుట్టపైకి రావాల్సి ఉంటుంది. మూడంచల భద్రతతో కర్రెగుట్టలపై ఉన్న నక్సలైట్లు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న పౌర హక్కుల నేతలు…
కర్రెగుట్టలపై మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు అక్టోపస్ దళాలు భారీ ఎత్తున మోహరించిన నేపథ్యంలో ఇరువర్గాల కాల్పులు జరగకూడదని శాంతి నెలకు నెలకొనాలని పౌర హక్కుల సంఘం కేంద్ర కమిటీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వచ్చినప్పటికీ గంటలు గడిచినకొద్ద్దీ పోలీస్ బలగాలు భారీ ఎత్తున పెరుగుతుండడంతో మావోయిస్టులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం వరకు ఎలాంటి క్లారిటీ లేనందున మావోయిస్టు సైతం యుద్ధానికి సిద్ధమే ఉన్నట్టు తెలుస్తుంది.
అందుకుగాను భారీగా మోహరించిన బలగాలను ఎదుర్కొనేందుకు గుట్ట మధ్యలో ఉన్న ఆదివాసీలను తిరిగి పంపించేసి నేరుగా యుద్ధానికి దిగాలనే ఆలోచనకు కర్ర గుట్టపై ఉన్న మావోయిస్టులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి నిర్ణయాలు వెలుపడతాయో బుధవారం రాత్రి ఎలాంటి విపత్కర పరిస్థితులు నెలకొంటాయి అనేది తెలియకుండా ఉంది. ఇదిలా ఉంటే కర్రగుట్ట ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధించడమేకాకుండా చుట్టుపక్కల గ్రామాలన్నీ పోలీసుల గుప్పిట్లోకి వెళ్లాయి. ఆదివాసీ గ్రామాల ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. జనజీవనాన్ని స్తంభింప చేశారు. ఎటునుంచి పోలీసు బలగాలు వెళ్తున్నాయో ప్రజలకు అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. చత్తీస్‌గఢ్ అడవుల గ్రామాలు పోలీస్ కబంధహస్తాల్లోకి పోయాయి.