Saturday, November 16, 2024

ముస్లిం మహిళలను లక్ష్యం చేసుకుంటున్నారు: అసదుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓటింగ్ ప్రక్రియలో ముస్లిం మహిళలను బిజెపి కావాలని లక్ష్యం చేసుకుంటోందని మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బిజెపి ఢిల్లీ యూనిట్ బురఖా ధరించిన ఓటర్లను సక్రమంగా పరిశీలించాలని కోరింది.

‘‘బురఖా ధరించిన ఓటర్లను ప్రత్యేకించి పరిశీలించాలని(స్పెషల్ చెక్ )ఎన్నికల సంఘాన్ని కోరింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికలప్పుడు వారి అభ్యర్థులు ముస్లిం మహిళా ఓటర్లను పరిశీలన పేరిట అవమానించారు. ప్రతి ఎన్నికల్లోనూ బిజెపి ఏదో ఒక కారణంతో ముస్లిం మహిళలను వేధిస్తోంది’’ అని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.

దీనికి ముందు ఢిల్లీ బిజెపి ప్రతినిధి బృందం ఎన్నికల ప్రధానాధికారిని(సిఈవో)ను బుధవారం కలిసింది. మే 25న జరిగే ఎన్నికల్లో బురఖా ఓటర్లను బాగా పరిశీలించాలని(థరో వెరిఫికేషన్) చేయాలని కోరింది. ఆ పరిశీలన ప్రక్రియను మహిళా అధికారిణిలతో జరిపించాలని కూడా పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News