Friday, November 22, 2024

అమర్త్యసేన్‌ను టార్గెట్ చేయడం దయనీయం: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -
నోబెల్ గ్రహీతకు విశ్వభారతి నోటీసు!

న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌ను ప్రభుత్వం లక్షం చేసుకుందని కాంగ్రెస్ గురువారం నిందించింది. విశ్వభారతి యూనివర్శిటీలో ఉన్న 13 దశాంశాల భూమిని ఖాళీ చేయాలని విశ్వభారతి యూనివర్శిటీ తొలగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమి ఆక్రమించిందని పేర్కొంది. దాంతో అమర్త్యసేన్‌ను మోడీ ప్రభుత్వం లక్షం చేసుకుంటోందని గురువారం ఆరోపించింది. ‘మే 6లోగా లేక ఉత్తర్వు ప్రచురించిన ఏప్రిల్ 19 నుంచి 15 రోజుల్లోగా అనధికారిక పద్ధతిలో ఆక్రమించిన భూమి నుంచి ఖాళీ చేయాలి’ అని యూనివర్శిటీ పేర్కొంది.

అమర్త్యసేన్‌కు జారీచేసిన తొలగింపు ఉత్తర్వుపై మీడియా నివేదికను ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విట్టర్‌లో ‘ప్రధాన మంత్రి తనను తీవ్రంగా విమర్శించేవారినెవరినైనా వేధిస్తారని, భయపెడతారని అందరికీ తెలుసు. కానీ వాజ్‌పేయి చేతుల మీదుగా భారత రత్న అవార్డు అందుకున్న నోబెల్ గ్రహీత అమర్తసేన్‌ను మోడీ టార్గెట్ చేయడం దయనీయం’ అన్నారు.

‘అమర్త్య కుమార్ సేన్, సంబంధిత వ్యక్తులందరూ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలి. అవసరమైతే వారిని బలప్రయోగం ద్వారా ఖాళీ చేయించడం జరుగుతుంది’ అని నోటీసులో పేర్కొన్నారు. ‘షెడ్యూల్డ్ ప్రాంగణంలో వాయువ్య దిక్కులో 50 అడుగులు x 111 అడుగుల దశాంశాల భూమిని ఆయన నుంచి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించాము’ అని కూడా నోటీసులో పేర్కొన్నారు.
నోబెల్ బహుమతి గ్రహీత శాంతినికేతన్‌లోని పూర్వీకుల ఇల్లు ‘ప్రతీచి’లో నివసిస్తున్న సేన్‌కు కొన్ని రోజుల క్రితం సెంట్రల్ యూనివర్శిటీ మరో నోటీసును జారీ చేసింది, ‘మిస్సివ్’పై స్పందించడానికి, అనధికార భూమి నుంచి ఖాళీ చేయడానికి, ఏప్రిల్ 19 వరకు సమయం ఇచ్చింది. ఖాళీ చేయకపోతే తగిన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News