Monday, December 23, 2024

పెళ్లిపై స్పందించిన తరుణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ లో లవర్ బాయ్ గా హీరో తరుణ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ మధ్యన సినిమాల్లో నటించడం తగ్గించిన విషయం తెలిసిందే. తరుణ్ కు పెళ్లికాకపోవడంతో ఆయనపై సోషల్ మీడియాలో రూమర్లు షికార్లు చేస్తున్నాయి. తన పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తరుణ్ స్పందించారు. తనకు పెళ్లి జరుగుతున్న విషయం నిజం కాదని స్పష్టం చేశారు. పెళ్లి నిశ్చయం అయితే ముందుగా సోషల్ మీడియా, మీడియాకు సమాచారం ఇస్తానని వివరణ ఇచ్చాడు. తన పెళ్లిపై అనవసరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయవద్దని కోరాడు. సోషల్ మీడియాలో తనపై పుకార్లు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదని తెలియజేశాడు.

Also Read: అట్టర్‌ప్లాప్ సినిమాను అద్భుతం అంటున్నారు: అంబటి రాంబాబు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News