Tuesday, January 21, 2025

కార్గిల్ యుద్ధం…. పాక్ చొరబాటుపై సమాచారం ఇచ్చిన గొర్రెల కాపరి మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికుల చొరబడ్డారని భారత జవాన్లకు సమాచారం ఇచ్చిన గొర్రెల కాపరి తాషి నామ్‌గ్యాల్(58) కన్నుమూశారు. లద్ధాక్‌లోని ఆర్యన్ వ్యాలీలో తాషి తుడి శాస విడిచారని లేహ్‌లోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ఫ్ తెలిపింది. తాసి మృతి పట్ల భారత సైన్యం సంతాపం తెలిపింది. ఓ దేశ భక్తుడిని కోల్పోయామని, లద్ధాఖ్ ధైర్యానికి ఆత్మ శాంతి చేకూరలన్నారు. 1999 మే 3న తాషి గొర్రెలు కాస్తుండగా గొర్రె తప్పిపోవడంతో వెతుక్కుంటూ బటాలిక్ పర్వత ప్రాంతాల్లోకి వెళ్లాడు. అక్కడ పాక్ సైనికులు కనిపించడంతో వెంటనే భారత జవాన్లకు సమాచారం ఇచ్చాడు.

భారత్ సైన్యం కెప్టెన్ సౌరభ్ కాలియా నేతృత్వంలో ఓ పెట్రోలింగ్ పార్టీని మే5న అక్కడికి పంపాడు. తొలు ఉగ్రవాదులు వేర్వేరు మార్గాల ద్వారా వచ్చారని సైన్యం భావించింది. భారత సైన్యం భారీగా మోహరించి యుద్ధం చేస్తుండగా ప్రతిఘటన మొదలుకావడంతో వాళ్లు వాడుతున్న ఆయుధాలను తీరు చూసి పాక్ సైనికులు అని ధృవీకరించుకున్నారు. ఈ యుద్ధంలో పాక్ తొక ముడిచింది. జులై 26 పాక్ సైనికులను భారత్ సైన తరిమికొట్టింది. జులై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటుంది. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ద్రాస్‌లో జరిగిన వేడుకలకు తాషి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News