- Advertisement -
హైదరాబాద్: తెలంగాణను స్కిల్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ ట్రైనింగ్ జరుగుతుందని అన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యత ఇస్తూ.. పరిశ్రమల సమన్వయం పెంచాలని చెప్పారు. టాస్క్ డిఈఈటి, విద్యాసంస్థలతో స్కిల్ వర్శిటీ సమన్వయం కీలకమని తెలియజేశారు. తెలంగాణ యువతలో ప్రతిభకు కొదవలేదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
- Advertisement -