Thursday, January 9, 2025

ఫుడ్‌పాయిజనింగ్‌పై టాస్క్‌ఫోర్స్

- Advertisement -
- Advertisement -

ముగ్గురు సభ్యులతో ఏర్పాటు సభ్యులుగా ఫుడ్‌సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారి
గురుకులాలు, హాస్టళ్లు, అంగన్‌వాడీలు, ఆసుపత్రులలో ఆహార నాణ్యతను పరీక్షించనున్న కమిటీ
ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు అందుకు కారణాలను వెలికితీసి బాధ్యులను గుర్తించనున్నటాస్క్‌ఫోర్స్
ఫుడ్‌సేఫ్టీ కమిటీలనూ ఏర్పాటు చేసిన ప్రభుత్వం పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడి కేంద్రాలలో
ఏర్పాటు కమిటీ సభ్యులు రుచి చూసిన తరువాతే విద్యార్థులకు భోజనం

మన తెలంగాణ/హైదరాబాద్ : గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వరుస ఘటనల నేపథ్యంలో ప్రభు త్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీలు, ఆసుపత్రుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏ ర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఘటన జరిగిన శాఖ అధిపతి లేదా అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా అధికారి టాస్క్‌ఫోర్స్ లో సభ్యులుగా నియమించింది. ఆహార కల్తీ జరిగినప్పుడు వెం టనే తనిఖీ చేసి, కారణాలతో పాటు బాధ్యులను గుర్తించి ఈ క మిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు గురుకులాలు, హాస్ట ళ్లు, అంగన్‌వాడీల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి విద్యా సంస్థలో హెడ్ మా స్టర్, ఇద్దరు సిబ్బందితో ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ కిచెన్‌లో పరిశుభ్రత పరిశీలించిన తర్వాతే వంట చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంట పూర్తయ్యాక ఫుడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు రుచి చూసిన తర్వాత విద్యార్థులకు వడ్డించాలని స్పష్టం చేశారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని కలెక్టర్‌లను సిఎస్ ఆదేశించారు. పర్యవేక్షకులు కూడా పిల్లలకు భోజనం పెట్టే ముందు, కిచెన్‌లో పరిశుభ్రత తనిఖీ చేసి, భోజనం రుచి చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News