Monday, December 23, 2024

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

- Advertisement -
- Advertisement -
  • ముగ్గురిపై కేసు నమోదు

దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని భూంపల్లి గ్రామంలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రమేష్, సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై రైడ్ చేసి ముగ్గురుని ఎల్లన్న దుర్గారెడ్డి, దొమ్మ రాంరెడ్డి, దొమ్మ రామిరెడ్డి, ము గ్గురు నివాసం భూంపల్లి వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 2750/- రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకుని భూంపల్లి పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో, ఫామ్ హౌస్‌లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100కు సమాచారం అందించాలని కోరారు. పేకాట, జూదం, వంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News