Tuesday, April 1, 2025

టకీలా పబ్‎పై టాస్క్‎ఫోర్స్ దాడులు.. 18 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Task Force Raid In Tequila Pub

హైదరాబాద్: నగరంలోని పబ్బుల్లో గబ్బ పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అర్ధరాత్రి అయిన పబ్బులు నడుస్తూనే ఉన్నాయి. రామ్ గోపాల్ పేట టకీలా పబ్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పబ్‌లో నిర్ణీత సమయాన్ని ఉల్లంఘించి పార్టీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్ లో అనుమతి లేకుండా యువతులతో నృత్యాలు చేయిస్తున్నట్టు గుర్తించారు. పార్టీలు చేసుకుంటున్న 18 మందిని అరెస్టు చేశారు. సౌండ్ సిస్టమ్‌ను సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్‌ను కూడా సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో 8 మంది డ్యాన్స్ గర్ల్స్, 8 మంది కస్టమర్లు, డి.జె ఆపరేటర్, ఆర్గనైజర్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పబ్ పై రాంగోపాల్‌పేటలో కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News