Tuesday, September 17, 2024

మరో అఫ్గానిస్థాన్‌గా బంగ్లాదేశ్‌ను మార్చే కుతంత్రం: తస్లీమా నస్రీన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌ను మరో అఫ్గానిస్థాన్‌గా లేదా ఇరాన్‌గా మార్చాలని ఇస్లామిక్ రాడికల్స్ కుతంత్రం చేస్తున్నారని, భారత్ వ్యతిరేకులుగా, హిందూ వ్యతిరేకులుగా, పాకిస్థాన్‌కు అనుకూలురుగా యువకుల మనస్సు మారేలా బోధనలు చేస్తున్నారని ప్రఖ్యాత రచయిత్రి, ఉద్యమ నాయకురాలు తస్లీమా నస్రీన్ వెల్లడించారు. “లజ్జ” రచయిత్రి అయిన నస్రీన్ బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణ అయిన తరువాత 2005 నుంచి భారత్‌లో నివసిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల కోటా ఉద్యమానికి తాను, మరికొందరు మొదట్లో మద్దతు అందించామని చెప్పారు.

అయితే తరువాత ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా హింసాత్మక దాడులు జరగడం, జర్నలిస్టులను టార్గెట్ చేసుకోవడం, జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడిపించడం విగ్రహాలను, శిల్పాలను, మ్యూజియంలను కూల్చివేయడం, తదితర సంఘటనలు జరుగుతుండడంతో ఇది విద్యార్థుల ఉద్యమం కాదని తెలుసుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ ఆందోళనలకు ఇస్లామిస్ట్ జిహాదీలు నిధులు అందిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితికి మాజీ ప్రధాని హసీనాయే కారకురాలని నస్రీన్ ఆరోపించారు.

అధికారంలో శాశ్వతంగా ఉండడానికి ఆమె మతాన్ని ఉపయోగించుకున్నారని, సెక్యులర్ స్కూళ్లకు బదులు ఇస్లామిస్టులను సంతృప్తి పర్చడానికి 560 మసీదులను, మదర్సాలను హసీనా నిర్మింప చేశారని పేర్కొన్నారు. భారత్‌లో నివసించడానికి అనుమతించే రెసిడెంట్ పర్మిట్ జులై 27 నాటికే చెల్లిపోయిందని, సాధారణంగా ఆ తేదీకి ముందే రెన్యువల్ చేయించాల్సి ఉందన్నారు. నామాతృదేశం బంగ్లాదేశ్‌కు తాను తిరిగి వెళ్లేది లేదని, ఖలీదా,హసీనా పాలనా కాలంలో తనను బంగ్లాదేశ్‌లో ప్రవేశించనీయలేదని, కొంతమంది తన బంధువులు , తన తండ్రి, నాన్నమ్మ, మామయ్యలు బంగ్లాదేశ్ లోనే ఉన్నారని, నాదేశం వెళ్లడానికి తనకు హక్కు ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News