Wednesday, January 22, 2025

టాటా 50లక్షల కార్ల మైలురాయి

- Advertisement -
- Advertisement -

ముంబయి: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అరుదైన ఘనతను నమోదు చేసింది. 50లక్షల ప్యాసింజర్ వాహనాల ప్రొడక్షన్ మార్కును అధిగమించినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. 1998 నుంచి మార్కెట్లోకి వివిధ రకాల బ్రాండ్లను టాటా మోటార్స్ ప్రవేశపెట్టింది. 25ఏళ్లకు 50లక్షల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు.

టాటా మోటార్స్ కార్లు, ఎస్‌యూవీలతో 50లక్షల సంఖ్యను తెలియజేసేలా ఓ ఫార్మేషన్ ఏర్పాటు చేశారు. నెలరోజులపాటు సంస్థ ప్లాంట్లు, కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. కాగా 2004లో 10లక్షల యూనిట్లు, 2010లో 20లక్షలు, 2015లో 30లక్షలు, 2020నాటికి కార్లను టాటా ఉత్పత్తి చేసింది. 2020 అనంతరం కొవిడ్ సంక్షోభం,ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఉన్నప్పటికీ అధిగమించి 3సంవత్సరాల్లో 10లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. ఈక్రమంలో 50లక్షల కార్ల మైలురాయికి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News