టాటా మోటార్స్ తన కార్లలో భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎక్కువ వీటిని కొనడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఈ కంపెనీ కార్లు డిజైన్, పరంగా ప్రస్తుతం ఉన్న కార్ల కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. కానీ, భద్రతలో మాత్రం ముందంజలో ఉన్నాయి.
ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే..జూన్ నెలలో కంపెనీ తన కస్టమర్లకు భారీ తగ్గింపులను ఇస్తోంది. కేవలం తమ పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ ఈ తగ్గింపులను అందిస్తోంది.
ఇక ఆఫర్ల విషయానికి వస్తే.. టాటా చిన్న కారు టియాగో పెట్రోల్‌పై దాదాపు రూ. 90,000 తగ్గింపు అందుబాటులో ఉంది. టిగోర్‌లో అయితే రూ. 85,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది కాకుండా..ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్ రేంజ్‌లో ఏకంగా రూ. 70,000 ఆదా చేసుకునే అవకాశం ఉంది. కాంపాక్ట్ SUV నెక్సాన్ శ్రేణిపై రూ. 95,000 వరకు తగ్గింపును పొందొచ్చు. కాగా, టాటా హారియర్‌పై గరిష్టంగా రూ. 1.33 లక్షల బంపర్ తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇది కాకుండా టాటా సఫారీపై సుమారు రూ. 1.33 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది.
టాటా మోటార్స్ కొత్త స్టాక్ పై చాలా తక్కువ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ Tiago, Tigor, Altroz, Nexon Harrier Safri లపై కేవలం రూ. 25,000 నుండి రూ. 60,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో టాటా పాత స్టాక్‌ను కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.