Tuesday, November 5, 2024

టాటాల చేతికి చింగ్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టాటా గ్రూపు కన్జూమర్స్ ఇండస్ట్రీస్‌పై మరింత ఫోకస్ పెట్టింది.చింగ్స్ పేరిట దేశీయ చైనీస్ సాస్‌లు,స్మిత్ అండ్ జోన్స్ పేరిట అల్లం, వెలులల్లి పేస్ట్‌ను తయారు చేసే క్యాపిటల్ గూడ్స్‌ను కొనుగోలు చేయనుంది.ఆర్గానిక్ టీలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయించే ఆర్గానిక్ ఇండియానూ సొంతం చేసుకోనుంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ విభాగంలో తన ప్రాడక్ట్ పోర్టుఫోలియోను పెంచుకోవడానికి ఈ కొనుగోళ్లు టాటా గ్రూపునకు దోహదం చేయనున్నాయి.

క్యాపిటల్ ఫుడ్‌ను రూ.5,100 కోట్లకు, ఆర్గానిక్ ఇండియాను రూ.1900 కోట్లకు టాటా కన్జూమర్ ప్రాడక్ట్ కొనుగోలు చేయనుంది. క్యాపిటల్ ఫుడ్స్‌లో మొదట 75 శాతం వాటాలను కొనుగోలు చేసి ఆ తర్వాత మూడేళ్లలో మిగతా 25 శాతం వాటాను దక్కించుకోనుంది.ఆర్గానిక్ ఇండియాలో పూర్తి వాటాను టాటా కన్జూమర్ ప్రాడక్ట్ కొనుగోలు చేస్తుంది. క్యాపిటల్ ఫుడ్స్ పూర్తి ఆపరేటింగ్ కంట్రోల్‌తో పాటుగా బోర్డులో మెజారిటీ సభ్యులు టాటాలకు చెందిన వ్యక్తులే ఉంటారని టాటా కన్జూమర్ తెలిపింది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ గుప్తా కన్సల్టెంట్‌గా కొనసాగుతారని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News