- Advertisement -
న్యూఢిల్లీ : పోటీ మార్కెట్లో వ్యాపార విస్తరణ కష్టాలు పెరగడంతో వోల్టాస్ లిమిటెడ్ కం పెనీని విక్రయించాలని టాటా గ్రూప్ యోచిస్తోందంటూ వార్త వచ్చాయి. అయితే ఈ వార్తలు నిరాధారమైనవి, తప్పు అని కంపెనీ ఖండించింది. వోల్టాస్ గృహోపకరణ వ్యాపారాన్ని టాటా గ్రూప్ విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలను వోల్టాస్ లిమిటెడ్ తప్పుగా పేర్కొంది. కంపెనీ నుండి వాస్తవాలను నిర్ధారించకుండా కొన్ని ఇతర ప్రచురణలు, చానెల్‌లు పేర్కొనడం సరికాదని టాటా గ్రూప్ అధికారులు అన్నారు. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం వోల్టాస్ షేర్లు 1.70 శాతం పడిపోయాయి. కంపెనీ షేరు రూ. 14.10 (-1.70%) క్షీణతతో రూ.813.80 వద్ద ముగిసింది.
- Advertisement -