Friday, December 27, 2024

బ్రిటన్‌లో టాటా ‘బ్యాటరీ గిగాఫ్యాక్టరీ’

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. దీని కో సం కంపెనీ 4 బిలియన్ పౌండ్లు అంటే రూ. 42,347 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, టాటా గ్రూప్ బ్రిటన్‌లో యూరప్‌లోనే అతిపెద్ద బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని అన్నారు. టాటా గ్రూప్ ప్రకటన తర్వాత బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ మాట్లాడుతూ, ఇది వేలాది మంది బ్రిటన్‌లకు ఉద్యోగాలను అందించడమే కాకుండా, పెట్రోల్- డీజిల్ నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారే లక్ష్యానికి దారి తీస్తుందని అన్నారు.

ప్రారంభంలో టాటా గ్రూప్, జెఎల్‌ఆర్‌లకు బ్యాటరీలు సరఫరా చేస్తారు. గ్రూప్ ప్రస్తుతం బ్రిటన్‌లో జాగ్వార్, ల్యాండ్ రోవర్ లగ్జరీ కార్లు, ఎస్‌యువిలను తయారు చేస్తోంది. గిగాఫ్యాక్టరీ పెట్టుబడికి టాటా గ్రూపునకు ఆర్థిక సహాయం కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. టాటా కు ప్రభుత్వం కోట్లాది పౌండ్ల సబ్సిడీని అందిస్తోంది. ఈ పెట్టుబడి సోమర్‌సెట్‌లోని బ్రి డ్జ్‌వాటర్ చుట్టూ ఉన్న 9,000 మందికి ఉద్యోగాలను సృష్టిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News