Wednesday, January 22, 2025

నెక్సాన్, టియాగో ధరలు తగ్గించిన టాటా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టాటా మోటార్స్ తన రెండు ఎలక్ట్రిక్ కార్లు అయిన నెక్సాన్, టియాగో ధరలను తగ్గించింది. నెక్సాన్ ఇవి ధర రూ.1.20 లక్షలు తగ్గగా, టియాగో ఇవి ధర రూ.70,000 తగ్గింది. బ్యాటరీ ధరల తగ్గుదల ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నామని, దీని కారణంగా రేట్లను తగ్గించినట్టు కంపెనీ పేర్కొందిరు. నెక్సాన్.ఇవి ధర ఇప్పుడు రూ. 14.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

లాంగ్ రేంజ్ నెక్సాన్.ఇవి రూ. 16.99 లక్షలకు అందుబాటులో ఉంటుంది. టియాగో బేస్ మోడల్ ధర రూ.7.99 లక్షలు ఉంది. అయితే కంపెనీ ఇటీవల విడుదల చేసిన పంచ్.ఇవి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ 70 శాతానికి పైగా వాటాతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది. 2023లో కంపెనీ మొత్తం 69,153 యూనిట్ల ఇవిలను విక్రయించింది. టాటా మోటార్స్ ఈ సంవత్సరం కర్వ్, హారియర్ ఇవి, సియెర్రా, ఆల్ట్రోజ్ ఇవిలను విడుదల చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News