Sunday, December 22, 2024

ప్రైమా 5530 ఎస్ ఎల్‌ఎన్‌జి ట్రక్కుల డెలివరీని ప్రారంభించిన టాటా మోటార్స్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ గ్రీన్ ఫ్యూయల్ రిటైలింగ్, లాజిస్టిక్స్ కంపెనీ అయిన క్లీన్ గ్రీన్ ఫ్యూయల్ అండ్ లాజి స్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టాటా ప్రైమా 5530.ఎస్ ఎల్‌ఎన్‌జి ట్రక్కుల డెలివరీని ప్రారంభించినట్లు భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహ న తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్రకటించింది. ఇటువంటి 150 ట్రక్కులను సరఫరా చేయడానికి టాటా మోటార్స్ ఆర్డ ర్ పొందింది. ఈరోజు అహ్మదాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో తొలి విడత వాహనాలను అందజేశారు. మిగిలిన టాటా ప్రైమా 5530.ఎస్ ఎల్‌ఎన్‌జి ట్రక్కుల డెలివరీలు దశలవారీగా జరుగుతాయి.

అదనంగా 350 యూనిట్ల ప్రైమా 5530.ఎస్ ఎల్‌ఎన్‌జి సరఫరా చేయడానికి టాటా మోటార్స్, క్లీన్ గ్రీన్ ఫ్యూయల్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ సందర్భంగా క్లీన్ గ్రీన్ ఫ్యూయల్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మిలన్ డొంగా మాట్లాడుతూ “రెండేళ్ల స్టార్టప్‌గా, మేం లాజిస్టిక్స్ పరిశ్రమలో గణనీయమైన పురోగతిని సాధించాం. గ్రీన్ ఫ్యూయల్ సొల్యూషన్‌లతో కార్యకలాపాలను విప్లవాత్మకంగా మార్చడానికి మేం కట్టుబడి ఉన్నాం. టాటా మోటార్స్ అధునాతన ఎల్‌ఎన్‌జి ట్రాక్టర్‌లను మా ఫ్లీట్‌కు చేర్చడం మా కార్య కలా పాలను మరింత పర్యావరణ స్నేహపూర్వకంగా మార్చడంలో ముఖ్యమైన ముందడుగు. మొబిలిటీని మరింత పరిశుభ్ర మైందిగా, మరింత సుస్థిరదాయకమైందిగా చేయడంలో టాటా మోటార్స్ ముందుంది, అదే సమయంలో మొత్తం కార్యకలాపాల వ్యయం తక్కువగా ఉండేలా చేస్తోంది. పటిష్ఠ విక్రయానంతర సేవను అందిస్తోంది. ఈ నవతరం వాహనాలు టాటా మోటార్స్ అత్యాధునిక కనెక్టెడ్ వెహి కల్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లీట్ ఎడ్జ్ ను కలిగి ఉన్నందున, సరైన నిర్ణయం తీసుకోవడానికి రియల్ టైమ్ డేటా ఫ్లోలు, స్మార్ట్ అనలిటిక్స్ నుండి కూడా మేం ప్రయోజనం పొందుతాం” అని అన్నారు.

భాగస్వామ్యంపై మాట్లాడుతూ , టాటా మోటార్స్ ట్రక్స్ వైస్ ప్రెసిడెంట్ & బిజి నెస్ హెడ్ రాజేష్ కౌల్ మాట్లాడుతూ, “టాటా ప్రైమా 5530.ఎస్ ఎల్‌ఎన్‌జి ట్రక్కుల మొదటి బ్యాచ్‌ను క్లీన్ గ్రీన్ ఫ్యూయల్‌ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అందించడం పట్ల మేం సంతోషిస్తున్నాం. లాజిస్టిక్స్‌ను మరింత గ్రీన్ గా, స్మార్ట్ గా చేయడం వారి లక్ష్యం. వారి లక్ష్యానికి మేం కూడా కట్టుబడి ఉన్నాం. మా ట్రక్కులు ఆకట్టుకునే పనితీరు, అధిక సామర్థ్యంతో పని చేస్తాయి. తక్కువ ఉద్గారాలను వెలువరిస్తాయి, ఇవి క్లీన్ గ్రీన్ ఫ్యూయల్‌ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవసరాలు, సుస్థి రత్వ లక్ష్యాలకు సంపూర్ణంగా సరిపోతాయి’’ అని అన్నారు.

టాటా ప్రైమా 5530.S ఎల్ఎన్జీ ఇంధన-సమర్థవంతమైన కమ్మిన్స్ 6.7L గ్యాస్ ఇంజిన్‌తో ఉంటుంది. అసాధారణ పని తీరు కోసం 280hp శక్తిని, 1100Nm టార్క్‌ను అందిస్తుంది. పటిష్టంగా ఇంజనీరింగ్ చేయబడిన ఈ వాహనం ఉపరితల రవాణా, సుదూర వాణిజ్య కార్యకలాపాలకు బాగా సరిపోతుంది. ప్రీమియం ప్రైమా క్యాబిన్ డ్రైవర్ సౌకర్యాన్ని పెంచుతుంది. గేర్ షిఫ్ట్ అడ్వైజర్ వంటి ఫీచర్లు ఇంధన వినియోగాన్ని గరిష్ఠం చేస్తాయి, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిర్వహణ ఖర్చులను తగ్గిస్తాయి. టాటా ప్రైమా 5530.S ఎల్ఎన్జీ విభిన్న పని అవసరాలకు అనుగుణంగా సింగిల్, డ్యూయల్ ఫ్యూయల్ క్రయోజెనిక్ ట్యాంక్ ఎంపికలలో అందు బాటులో ఉంది. 1000కిమీల కంటే ఎక్కువ పరిధిని అందిస్తూ, డ్యూయల్ ట్యాంక్ ఎంపిక విస్తృత శ్రేణిని, మెరుగైన కార్యాచరణ సామర్థ్యాన్ని అందిస్తుంది, దీన్ని సుదూర కార్య కలాపాలకు అనువైందిగా చేస్తుంది. అంతేగాకుండా టాటా మోటార్స్ యొక్క ఫ్లాగ్‌షిప్ కనెక్టెడ్ వెహికల్ ప్లాట్‌ఫామ్‌ ట్రక్ ఫ్లీట్ ఎడ్జ్ సమర్ధవంతమైన ఫ్లీట్ మేనేజ్‌మెంట్ కు వీలుగా ఆపరేటర్లు వాహనాల పని సమయాన్ని మరింత పెంచడానికి, యాజమాన్యం యొక్క మొత్తం వ్యయాన్ని తగ్గించడా నికి వీలు కల్పిస్తుంది.

టాటా మోటార్స్ బ్యాటరీ ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబుషన్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలతో నడిచే వినూత్న మొబిలిటీ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంది. చిన్న వాణిజ్య వాహనాలు, ట్రక్కులు, బస్సులు, వ్యాన్లతో సహా వివిధ విభాగాలలో ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాణిజ్య వాహనాల పటిష్ఠ పోర్ట్‌ఫోలియోను కంపెనీ అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News