Sunday, December 22, 2024

టాటా ప్రీమియం ఎస్‌యువిల కోసం కొత్త పెట్రోల్ ఇంజిన్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రీమియం ‘స్పోర్ట్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యువి)’ కోసం కొత్త పెట్రోల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. రానున్న రోజుల్లో వీటిని హ్యారియర్, సఫారీలో ఉపయోగించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లలో 2 -లీటర్ల డీజిల్ ఇంజిన్‌ను వాడుతున్నారు. ఏటా రెండు లక్షల ప్రీమియం ఎస్‌యూవీలు అమ్ముడవుతున్నట్లు కంపెనీ ప్రయాణికుల వాహన విభాగం డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. వీటిలో 80 శాతం డీజిల్ వాహనాలే.

ఈ నేపథ్యంలోనే ఈ సెగ్మెంట్‌పై దృష్టి సారించి 1.5 లీటర్ జిడిఐ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ దిశగా పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. టాటా మోటార్స్ గతవారం హ్యారియర్, సఫారీలో వరుసగా రూ.15.49 లక్షలు, రూ.16.19 లక్షల ధరతో కొత్త వెర్షన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భద్రత విషయంలో వీటిని అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News