- Advertisement -
న్యూఢిల్లీ : అక్టోబర్ 1 నుంచి వాణిజ్య వాహన శ్రేణి ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్టు కంపెనీ తెలిపింది. వాహన మోడల్, వేరియంట్ల ఆధారంగా పెంపు ఉంటుందని సంస్థ పేర్కొంది. స్టీలు, మెటల్స్, పలు ఉత్పత్తి వస్తువుల ధరలు పెరుగుతూ ఉండడం వల్ల వాహన ధరలను పెంచడం తప్పనిసరి అయిందని కంపెనీ వెల్లడించింది. దేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ పెంచిన రేట్లలో ట్రక్‌లు, బస్సులు, లైట్ కమర్షియల్ వెహికిల్స్ ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కూడా ఒక్క సెలెరియో తప్ప మిగతా అన్ని వాహనాల ధరలను 1.9 శాతం పెంచింది. ఈ సంస్థ కూడా ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లేనని చెప్పింది.
- Advertisement -