Monday, January 20, 2025

జెన్‌సెట్‌లను విడుదల చేసిన టాటా మోటార్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ భారతదేశంలో కొత్త తరం, అత్యాధునిక శ్రేణి జెన్‌సెట్‌లను విడుదల చేసింది. విశ్వసనీయమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన CPCB IV+ (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ IV+) కాంప్లియెంట్ టాటా మోటార్స్ ఇంజిన్‌ల మద్దతుతో, అధిక-పనితీరు గల జెన్‌సెట్‌లు 25kVA నుండి 125kVA కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉన్నాయి.

ముఖ్య లక్షణాలు టాటా మోటార్స్ జెన్‌సెట్స్

ఇంధన సామర్థ్య్ట్యం
బ్లాక్ లోడ్ సామర్థ్యం
కస్టమర్లకు తక్కువ నిర్వహణ ఖర్చులు
నిరంతర కార్యకలాపాల కోసం పవర్ డెలివరీ
విభిన్న వినియోగాలకు అందుబాటు
తిరుగులేని కస్టమర్ మద్దతు

కొత్త శ్రేణి టాటా మోటార్స్ జెన్‌సెట్‌లు మరింత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బలమైన బ్లాక్ లోడింగ్ సామర్ధ్యంతో వస్తాయి. ఇది వ్యాపారాలకు తక్కువ నిర్వహణ ఖర్చులతో నిరంతరాయంగా పవర్ డెలివరీని అందిస్తుంది. టాటా మోటార్స్ అగ్రశ్రేణి R&D సౌకర్యంతో రూపొందించబడిన, అభివృద్ధి చేయబడిన, పరీక్షించబడిన, ఈ జెన్‌సెట్‌లను శక్తివంతం చేసే టాటా మోటార్స్ ఇంజిన్‌లు విభిన్నమైన ఉపయోగాలకు సరిగ్గా సరిపోతాయి.

ఈ ఆవిష్కరణపై టాటా మోటార్స్‌ స్పేర్స్, నాన్ వెహిక్యులర్ బిజినెస్ – కమర్షియల్ వెహికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ రామకృష్ణన్ మాట్లాడుతూ.. “టాటా మోటార్స్ అత్యాధునిక జెన్‌సెట్‌లను భారత మార్కెట్‌ కు పరిచయం చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ అధునాతన జెన్‌సెట్‌ లు భారతదేశ పరిశ్రమలు, మౌలిక వసతులు, పురోగతిని బలోపేతం చేయడా నికి మా నిబద్ధతను మరింత బలోపేతం చేస్తాయి. అత్యాధునిక జెన్‌ సెట్‌లు మెరుగైన పనితీరును అందిస్తాయి. మరింత ఇంధన-సమర్థవంతంగా ఉంటాయి. వ్యాపారాలకు తక్కువ నిర్వహణ ఖర్చులు అందించేలా, నిరంతరాయంగా పవర్ డెలివరీని నిర్ధారించే పటిష్ఠ బ్లాక్ లోడింగ్ సామర్థ్యంతో వస్తాయి. బలమైన దేశవ్యాప్త కస్టమర్ మద్దతుతో కూడిన అధునా తన శ్రేణి కొత్త జెన్‌సెట్‌లు అన్ని వ్యాపారాలకు ప్రయోజనకరంగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.

కొత్త శ్రేణి టాటా మోటార్స్ జెన్‌సెట్‌లు టాటా మోటార్స్ ఇంజన్‌ల యొక్క హరిత, క్లీనర్ విభాగాలచే శక్తిని పొందుతాయి. ఇవి మరింత ఇంధన సామర్థ్యంతో కాంపాక్ట్‌ గా ఉంటాయి. వినియోగదారులకు మనశ్శాంతిని అందించడానికి, మధ్యస్థ, చిన్న పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, హెల్త్‌ కేర్, హాస్పిటాలిటీ, టెలికాం, అద్దె వినియోగం, కార్యాలయాలు, గిడ్డంగులు వంటి విభిన్న అవసరాలను తీర్చడానికి జెన్‌సెట్‌లు రూపొందించబడ్డాయి, అభివృద్ధి చేయబడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News