Monday, December 23, 2024

టాటా మోటార్స్‌ లూబ్రికెంట్స్‌ వ్యూహాత్మక భాగస్వామిగా పెట్రోనాస్‌..

- Advertisement -
- Advertisement -

 

పెట్రోనాస్ లూబ్రికెంట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌ (PLIPL) మరియు టాటా మోటార్స్ ఇవాళ సరికొత్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంగీకార ఒప్పంద కార్యక్రమంలో పెట్రోనాస్‌ లూబ్రికెంట్స్‌ ఇకనుంచి టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వాహనాలకు లూబ్రికెంట్స్‌ వ్యూహాత్మక భాగస్వామిగా మారిందని ప్రకటించారు.

రెండు కీలక దిగ్గజ సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ప్రకటించే కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆసియా పెట్రోనాస్ లూబ్రికెంట్స్ ఇంటర్నేషనల్ రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గియుసేప్ పెడ్రెట్టి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ మరియు దేశంలోనే నమ్మకానికి మారుపేరుగా నిలిచే సంస్థ అంటే అందరికి గుర్తుకువచ్చేది టాటా మోటార్స్‌. టాటా మోటార్స్‌ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. భారతదేశంలోనే అత్యున్నత గ్రూప్‌ అయినటువంటి టాటా గ్రూప్‌నకు చెందినది టాటా మోటార్స్‌. ఇప్పుడు ఈ ఇద్దరి భాగస్వామ్యంతో పీఎల్‌ఐ మరియు టాటా మోటార్స్‌ రెండూ అభివృద్ధి పథంలో మరింతగా దూసుకెళ్తాయని భావిస్తున్నాను అని అన్నారు ఆయన.

ఈ సందర్భంగా పీఎల్‌ఐపీఎల్‌ సీఈఓ శ్రీ ప్రణవ్ భానాగే మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “మా ఈ భాగస్వామ్యం రెండు సంస్థల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. ఎందుకంటే మేము టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ వాహనాలకు కూడా లూబ్రికెంట్లను సరఫరా చేస్తున్నాము. ఇది ఒక్కటి చాలు పెట్రోనాస్ ఫ్లూయిడ్ టెక్నాలజీ సొల్యూషన్స్‌ నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పేందుకు అని అన్నారు ఆయన.

మరోవైపు టాటా మోటార్స్ ప్రస్తుత అవసరాలకు మాత్రమే లూబ్రికెంట్స్‌ సరఫరా చేయడమే కాకుండా భవిష్యత్తులో అవసరమయ్యే అన్ని సహాయాలను కూడా అందిస్తుంది. అంటే.. ప్రస్తుతం ఉన్న వాహనాలకు లూబ్రికెంట్స్‌ అందిస్తూనే టాటా మోటార్స్‌ రాబోయే రోజుల్లో తయారు చేసే వాహనాలకు ఎలాంటి లూబ్రికెంట్స్‌ కావాలి, ఎలాంటివి అయితే టాటా మోటార్స్‌కు అద్భుతంగా ఉపయోగపడతాయో కూడా చెప్తుంది. ఇందుకోసం లూబ్రికెంట్ల పరిశోధన మరియు అభివృద్ధిలో కూడా పాలుపంచుకోబోతోందని అన్నారు శ్రీ భానాగే.

భాగస్వామ్యం ‍‍ఒప్పంద సందర్భంగా శ్రీ ఆర్‌.రామకృష్ణన్‌, గ్లోబల్‌ హెడ్‌, కస్టమర్‌ కేర్‌, టాటా మోటార్స్‌ కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూనిట్‌ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వాహనాలకు లూబ్రికెంట్‌ వ్యూహాత్మక భాగస్వామిగా పెట్రోనాస్‌ని ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ భాగస్వామ్యం వల్ల టాటా మోటార్స్‌ జెన్యూన్‌ ఆయిల్‌ని తన వాహనాలకు వినియోగించగలుగుతుంది. అంతేకాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకు కూడా అందించగలిగే అవకాశం ఏర్పడుతుంది. టాటా మోటార్స్‌ జెన్యూన్‌ ఆయిల్‌ ప్రత్యేకమైన పద్ధతుల్లో ఎంతో నాణ్యతగా టాటా మోటార్స్ రూపొందించిన ఆయిల్‌. దీనివల్ల వాహనాల పనితీరు అద్భుతంగా పెరగడమే కాకుండా మంచి మైలేజ్‌ కూడా ఇస్తుంది. దీంతో ఆయిల్ వినియోగం ఎక్కువ రోజులు వస్తుంది. ఇప్పుడు ఈ భాగస్వామ్యంతో హై క్వాలిటీ ఆయిల్స్‌ భారతదేశంలోని అన్నీ టాటా మోటార్స్‌ ఆదరైజ్డ్‌ వర్క్‌షాప్స్‌లో అందుబాటులో ఉంటాయి.

TATA Motors Lubricants partnership of Petronas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News