Sunday, December 22, 2024

టాటా మోటార్స్ లాభం రూ.3,202 కోట్లు

- Advertisement -
- Advertisement -

గతేడాదిలో నష్టం నుంచి లాభాల్లోకి కంపెనీ
న్యూఢిల్లీ : జూన్ 30 ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో (మార్చిజూన్) టాటా మోటార్స్ నికర లాభం రూ.3,202 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ నష్టం రూ.5,006 కోట్లుగా ఉంది. అయితే మార్చి 31 ముగింపు నాటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.5,407 కోట్లతో పోలిస్తే తాజాగా టాటా మోటార్స్ లాభం తగ్గింది. అయితే వార్షిక ప్రాతిపదికన కంపెనీ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. కంపెనీ ఆదాయం రూ.1.01 లక్షల కోట్లతో 42.6 శాతం పెరిగింది. గతేడాది ఆదాయం రూ.71,227 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆదాయం 6.9 బిలియన్ పౌండ్లు, ఇది ఏడాది ప్రాతిపదికన 57 శాతం పెరిగింది. జూన్ త్రైమాసికంలో ల్యాండ్ రోవర్ రిటైల్ విక్రయాలు 29 శాతం పెరిగి 1.02 యూనిట్లకు చేరుకున్నాయి. కాగా, హోల్‌సేల్ విక్రయాలు 93,253 యూనిట్లతో 30 శాతం వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్ షేర్లు కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. ఫలితాలకు ముందు టాటా మోటార్స్ షేర్లు 2% లాభంతో రూ.641.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.642.50ని తాకింది.

ఎల్ అండ్ టి లాభం 46 శాతం వృద్ధి

క్యూ1 (ఏప్రిల్‌జూన్) త్రైమాసిక ఫలితాల్లో ఎల్ అండ్ టి (లార్సెన్ అండ్ టుబ్రో) నికర లాభం రూ.2,493 కోట్లతో 46.4 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1,702 కోట్లుగా ఉంది. అయితే త్రైమాసిక ప్రతిపాదికన చూస్తే లాభం 37 శాతం తగ్గింది. ఆదాయం రూ.47,882 కోట్లతో 33 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఆదాయం రూ.35,853 కోట్లుగా ఉంది. షేరుకు రూ.6 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

బజాజ్ ఆటో లాభం రూ.1,665 కోట్లు

మొదటి త్రైమాసిక ఫలితాల్లో బజాజ్ ఆటో నికర లాభం రూ1,665 కోట్లతో 42 శాతం వృద్ధిని సాధించింది. గతేడాదిలో కంపెనీ లాభం రూ.1,173 కోట్లుగా ఉంది. ఆపరేషన్స్ నుంచి ఆదాయం రూ.10,310 కోట్లతో 29 శాతం పెరిగింది. గతేడాది ఆదాయం రూ.8,005 కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News