Thursday, January 23, 2025

టాటా మోటార్స్ లాభం రూ.3,764 కోట్లు

- Advertisement -
- Advertisement -

క్యూ2లో కంపెనీ ఆదాయం రూ.1.05 లక్షల కోట్లు

ముంబై : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో టాటా మోటార్స్ అద్భుతంగా రాణించింది. క్యూ2 (జులైసెప్టెంబర్)లో  కంపెనీ రూ.3,764 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.944 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కాగా ఇంతకుముందు త్రైమాసికం క్యూ1లో కంపెనీ రూ.3,202 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్యూ2లో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 32 శాతం పెరిగి రూ.1.05 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.79,611 కోట్లుగా ఉంది. క్యూ1లో కంపెనీ ఆదాయం రూ.1.02 లక్షల కోట్లుగా ఉంది. టాటా మోటార్స్ నిర్వహణ లాభం ఎబిటా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.13,767 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.5,572 కోట్లుగా ఉంది. కంపెనీ ఎబిటా మార్జిన్ గత ఏడాది ఇదే త్రైమాసికంలో 7 శాతం నుండి సెప్టెంబర్ త్రైమాసికంలో 610 బేసిస్ పాయింట్లు పెరిగి 13.1 శాతానికి చేరుకుంది.

అదానీ పవర్ లాభం 848 శాతం జంప్
సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక (జూలై-సెప్టెంబర్) ఫలితాల్లో అదానీ పవర్ లిమిటెడ్ నికర లాభం రూ.6,594 కోట్లు న మోదు చేసింది. క్యూ2లో కంపెనీ నికర లా భం వార్షిక ప్రాతిపదికన 848 శాతం పెరిగింది. దీనిలో పన్ను క్రెడిట్ రూపంలో రూ. 1,371 కోట్ల లాభం కూడా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.696 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్యూ2లో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 84.42 శాతం పెరిగి రూ.12,990.58 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.7,043.77 కోట్లుగా ఉంది. దేశీయంగా బొగ్గు కొరత కారణంగా రూ.1,125 కోట్ల విలువైన వన్-టైమ్ ప్రీ పీరియడ్ వస్తువులు దీనిలో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

డాబర్ ఇండియా లాభం రూ.507 కోట్లు
సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక (జూలై-సెప్టెంబర్) ఫలితాల్లో దేశీయ ఎఫ్‌ఎంసిజి దిగ్గజం డాబర్ ఇండియా నికర లాభం రూ.507.04 కోట్లతో 5 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సం స్థ లాభం రూ.490.86 కోట్లుగా ఉంది. ఆదా యం రూ.2,986 కోట్ల నుంచి రూ.3,203 కోట్లకు పెరిగింది. కంపెనీ ఖర్చులు రూ. 2,669 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్లో డాబర్ ఇండియా షేరు 2.18 శాతం పెరిగి రూ.528కి చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News