Wednesday, January 22, 2025

సింగూరు ల్యాండ్ కేసులో టాటా మోటార్స్‌కు రూ.766 కోట్ల రికవరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సింగూర్‌లో ఉత్పత్తి కేంద్రం వల్ల జరిగిన నష్టాల కేసులో టాటా మోటార్స్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. పశ్చిమబెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(డబ్లుబిఐడిసి) వారు టాటా మోటార్స్‌కు సుమారు రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఆదేశాలు చేసింది. భూకేటాయింపు గొడవల వల్ల 2008 అక్టోబర్‌లో పశ్చిమబెంగాల్‌లోని సింగూర్ నుంచి టాటా నానో కారు ప్లాంట్‌ను గుజరాత్‌లోని సనంద్‌కు తరలించాల్సి వచ్చింది. అప్పటికే సింగూరులో టాటా మోటార్స్ రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. వార్షికంగా 11 శాతం వడ్డీతో రూ.765.78 కోట్ల పరిహారం డబ్లుబిఐడిసి నుంచి రికవరీ చేయాలని ముగ్గురు సభ్యుల ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News