Wednesday, January 22, 2025

అదిరిపోయే ఫీచర్లతో టాటా నానో ఈవి కారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  టాటా నానో కారు ఒక్కప్పుడు (అంటే దాదాపు 14 ఏండ్ల క్రితం) సామాన్య భారతీయ పౌరుడు కొనుగోలు చేసేందుకు అత్యంత చౌక ధరకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో  టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తీసుకొచ్చారు.  అయితే అదే కారు నేడు కొత్త రూపంలో అందరికీ అందుబాటులోకి వస్తున్నది. అదే టాటా నానో ఈవీ. ఇప్పటికైతే టాటా నానో ఈవీ కారు ఆవిష్కరణ తేదీ, దాని ధర వివరాలు, స్పెషిఫికేషన్స్‌పై టాటా మోటార్స్  అధికారికంగా ధృవీకరించకున్నా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో టాటా నానో కారుపై ఆసక్తి పెరుగుతోంది.

ప్రస్తుతం అధిక ధరల మార్కెట్లో ఇతర కార్లతో పోటీ పడుతూ తక్కువ ధరకు ఈ కారు తేవడం టాటా మోటార్స్ ముందున్న పెద్ద సవాల్. ప్రారంభంలో లక్ష రూపాయలకే అందుబాటులోకి వచ్చిన టాటా నానో కారు.. కొత్త రూపంలో టాటా నానోఈవీ కారుగా వస్తోంది. దీని  ధర రూ. 3 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని,  హై ఎండ్ మోడల్ ధర రూ.ఏడెనిమిది లక్షలు ఉండొచ్చని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News