Tuesday, November 5, 2024

టాటాసన్స్‌కే దక్కిన ఎయిర్ ఇండియా

- Advertisement -
- Advertisement -

న్యూTata Sons acquire Air Indiaఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని భారత ప్రభుత్వం అనేకసార్లు ప్రయత్నించింది. చివరికి ఆ సంస్థను ఇదివరలో ఆరంభించిన టాటాసన్స్ దానిని తిరిగి దక్కించుకుంది.
ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు గత నెల 29న అనేక సంస్థలు ఆర్థిక బిడ్లను దాఖలు చేశాయి. మొత్తం ఎయిర్ ఇండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్ చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియాను దక్కించుకోవాలన్న గట్టి పట్టు టాటాసన్స్ మాత్రమే కాకుండా స్పైస్‌జెట్ అధిపతి అజయ్ సింగ్‌కు కూడా ఉండింది. ప్రభుత్వం ‘మినిమమం రిజర్వ్ ధర’ను కూడా ఖరారు చేసింది. చివరికి టాటాసన్స్ రూ. 18,000 కోట్లతో ఆ ‘నేషనల్ క్యారియర్’ దక్కించుకుంది. ఏది ఏమైనా 68 ఏళ్ల తర్వాత టాటా సన్స్ తమ పాత సంస్థే అయిన ఎయిర్ ఇండియాను దక్కించుకోవడంను చాలా మంది అభినందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News