Saturday, January 25, 2025

టాటా టెక్నాలజీస్ ఐపిఓ ఆఫర్ ధర రూ.500

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన టాటా టెక్నాలజీస్ ఐపిఓఆఫర్ ధర ఖరారయింది. ఐపిఓలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు సహా అందరికీ ఒక్కో షేరు ఆఫర్ ధరను రూ.500గాటాటా మోటార్స్ నిర్ణయించింది. ఐపిఓ సందర్భంగా ధరల శ్రేణిని రూ.475రూ.500గా కంపెనీ నిర్ణయించిన విషయం తెలిసిందే. బుక్ రన్నింగ్ మేనేజర్లతో సంప్రదించిన తర్వాత ఆఫర్ ధరను రూ.500గా నిర్ణయించినట్లు టాటా మోటార్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మొత్తం రూ.3,042.5 కోట్ల ఐపిఓకు శుక్రవారంతో సబ్‌స్క్రిప్షన్ పూర్తయిన విషయం తెలిసిందే.

మదుపరులనుంచి లభించిన అనూహ్య స్పందనతో ఐపిఓకు మొత్తంగా 69.43 రెట్లు స్పందన లభించింది.4.5 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా చివరి రోజుపూర్తయ్యేసరికి మొత్తంగా 312.42 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.ఈ అనూహ్య స్పందనతో టాటా టెక్నాలజీస్ ఎల్‌ఐసి పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపిఓగా వచ్చిన ఎల్‌ఐసి రూ.20,557 కోట్ల సేకరణలో భాగంగా అత్యధికంగా 73.4 లక్షల దరఖాస్తులను అందుకొంది. తాజాగా టాటా టెక్నాలజీస్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News