Wednesday, January 22, 2025

యువతకు టాటా టెక్నాలజీస్ నైపుణ్య శిక్షణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టాటా టెక్నలజీస్ ఆంగీకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఐటిఐ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ప్రభుత్వ ఐటిఐలో రూ.2000 కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ ఇచ్చేందుకు టాటా టెక్నాలజీస్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో రేవంత్ సమావేశమయ్యారు. లక్షల మంది ఐటిఐ విద్యార్థులకు టాటా టెక్నాలజీస్ శిక్షణ ఇవ్వనుందని ఆయన పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆధునిక కోర్సులు ప్రవేశపెడుతామని రేవంత్ రెడ్డి వివరించారు. సాంకేతిక కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగం, ఉపాధితో లభించే విధంగా కోర్సులు ఉంటాయని వివరించారు. సొంతంగా బిజినెస్ పెట్టడానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇండస్ట్రీయల్ ఆటోమేషన్, రోబోటిక్స్, ఐఒటి, ఇవి మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ మెరిఫైయర్, విఆర్ ఆసిస్టెడ్ వెల్డింగ్, పెయింటింగ్, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ లాంటి పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో యువతికు టాటా టెక్నాలజీస్ శిక్షణ ఇవ్వనుంది. ప్రతి ఐటిఐల్లో మాస్టర్ ట్రైనర్లతో పాటు అయిదేళ్ల పాటు ఉచితంగా నిర్వహిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News