Monday, December 23, 2024

కుమార్తె బతికుండగానే చావు కబురు పంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: తన ఇష్టానికి విరుద్ధంగా ప్రేమించిన వాడితో వెళ్లిపోయిన కుమార్తెకు బతికుండగానే కర్మకాండ జరిపించేశాడో తండ్రి. రాజస్థాన్‌లోని భిల్వారాలో ఈ ఉదంతం ఇటీవల చోటుచేసుకుంది.

బిల్వారాలోని హమీర్‌గఢ్ పోలీసు స్టేషన్‌లో పరిధిలో నివసించే ఒక 19 ఏళ్ల యువతికి ఇరుపక్షాల అంగీకారంతో పెళ్లి సంబంధం నిశ్చయమైంది. ఇంతలో ఏం జరిగిందో కాని ఆ పెళ్లి రద్దయ్యింది. రెండు కుటుంబాల పెద్దల మధ్య మనస్పర్ధలు రావడంతో పెళ్లికి మంగళం పాడారు. అయితే వధువు, వరుడు మాత్రం అప్పటికే మనసులు ఇచ్చిపుచ్చేసుకున్నారు. పెద్దల నిర్ణయం ఎలా ఉన్నా తాము మాత్రం కలిసే జీవిద్దామనుకున్నారు. దీంతో ఇద్దరు పెద్దవారికి చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయారు.

తన కుమార్తె కనపడకపోవడంతో యువతి తండ్రి పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చాడు. యువతి ఆచూకీని కనుగొన్న పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకువచ్చి ఆమె తండ్రిని పిలిపించారు. తండ్రి సమక్షంలోనే ఆ యువతి తాను తన ప్రియుడితోనే గడుపుతానని పోలీసులకు తేల్చిచెప్పింది. తన ఇష్టానికి విరుద్ధంగా వేరే వ్యక్తితో వివాహం చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఆమె చెప్పింది. అంతేగాక తన తండ్రిని గుర్తుపట్టడానికి కూడా ఆమె పోలీసు స్టేషన్‌లో నిరాకరించింది.

దీంతో ఆగ్రహోదగ్రుడైన ఆ యువతి తండ్రి ఇక తనకూ, ఆమెకూ ఎటువంటి సంబంధం లేదని మండిపడ్డాడు. జీవితంలో ఇక తన కుమార్తె ముఖం చూడనని శపథం చేశాడు. అక్కడితో ఆగకుండా తన కుమర్తె వనిపోయిందని, కర్మకాండలు జరుపుతున్నానని చెబుతూ బంధువులందరికీ చావు కార్డు రాసి పాడేశాడు. ఇప్పుడు ఆ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News