Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌కు రాజయ్య గుడ్‌బై.. కెసిఆర్‌కు రాజీనామా లేఖ

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో ఓటమితో సతమతమవుతున్న బిఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. ఆయన త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో రాజయ్యకు స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ నిరాకరించిన కెసిఆర్‌, బదులుగా కడియం శ్రీహరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఈ నిర్ణయం రాజయ్యకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని సమాచారం. తన అనుచరులతో కూలంకషంగా చర్చించిన రాజయ్య పార్టీని వీడడమే ఉత్తమమైన చర్య అని తేల్చారు. ఈ నేపథ్యలోనే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు తాటికొండ రాజయ్య. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు జరిపిన ఆయన, సిఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News