Friday, November 22, 2024

273మందితో కొట్టుకుపోయిన నౌక…

- Advertisement -
- Advertisement -

ముంబయికి పశ్చిమ తీరాన బాంబే హైవేలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది. ఈ నౌకలో 273మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న నౌకాదళం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఐఎన్‌ఎస్ కొచ్చి యుద్ధ నౌక సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు గుజరాత్‌లోని 17 జిల్లాల్లో లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం 54 ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తుపాను తీవ్రత నేపథ్యంలో ముంబయి విమానాశ్రయాన్ని సాయంత్రం 6గంటల వరకు మూసివేశారు. మరోవైపు మహారాష్ట్ర కొంకణ్ తీరంలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. రెండు పడవలు గల్లంతయిన ఘటనలో ఇద్దరు, మరో ఇద్దరు చెట్లు కూలి చనిపోయారు. రాయిగఢ్ జిల్లాలో ముగ్గురు మత్యకారులు గల్లంతయ్యారు.

Tauktae Cyclone: Barge with 273 on board adrift

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News