న్యూఢిల్లీ : అసెస్‌మెంట్ ఇయర్ 202324కు ఆదాయం పన్ను రిటర్న్(ఐటిఆర్) దాఖలు చేసి మీ రిటర్న్‌ల కోసం వేచిచూస్తున్నారా? అయితే మీకోసమే కొత్త విధానాన్ని ఐటి పోర్టల్‌లో ప్రారంభించారు. దీంతో పన్ను రిఫండ్ పరిస్థితి ప్రత్యక్షంగా చెక్ చేసుకోవచ్చు. ఐటి రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు జూలై 31 వరకే ఉంది. గడువు దగ్గర పడుతుండటంతో రిటర్న్ దాఖలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు ఐటి శాఖ కూడా రిటర్న్‌ల దాఖలు ప్రక్రియను ప్రారంభించింది. అంటే పన్ను చెల్లింపుదారులు వాపసు డబ్బు పొందడం ప్రారంభించారు.
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 11.22 కోట్ల మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 1.33 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. వీటిలో దాదాపు 1.26 ఆదాయపు పన్ను రిటర్న్‌లు కూడా ధృవీకరించగా, ఇప్పటివరకు 3,973 ఐటి రిటర్నులను ప్రాసెస్ చేసింది.
ఐటి రిఫండ్ స్థితిని తనిఖీ ఇలా..
l ఆదాయపు పన్ను శాఖ ‘ఇ-ఫైలింగ్ పోర్టల్’కు వెళ్లి, క్విక్ లింక్స్‌ను ఎంచుకోండి.
l మెనూలో ‘నో యువర్ రీఫండ్ స్టేటస్’పై క్లిచ్ చేయాలి.
l ఇప్పుడు పాన్ నంబర్, అసెస్‌మెంట్ ఇయర్, మొబైల్ నంబర్ వంటి వివరాలను పూరించాలి.
l మీ మొబైల్ నంబర్‌కి ఒటిపి వస్తుంది. ఆ ప్లేస్‌లో ఒటిపిని ఎంటర్ చేయాలి.