Saturday, November 23, 2024

సచ్చేదిన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో మం చి రోజులు పోయి గడ్డుకాలం వచ్చిందని, ఆర్ధికంగా దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నార ని, ఈ దయనీయ పరిస్థితులు ఈ ఏడాది మ రింత తీవ్రరూపం దాలుస్తాయని ఆర్థ్ధికవేత్తల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశ ప్రజలు ఆర్థ్ధిక ఎదుగుదల క్షీణించిపోయిందని, అందుకే పొదుపు చర్యలు పూర్తిగా దిగజారాయని, అది 30 ఏళ్లు వెనక్కు వెళ్లాయని ప్రముఖ ఆర్ధికవేత్త మోతీలాల్ ఓస్వాల్ నివేదికలు స్ప ష్టం చేస్తున్నాయి. 2023లో ద్రవ్యోల్బణం కేవ లం 5.5 శాతం నుంచి 5.8 శాతం మధ్యలోనే ఉంటుందని, దేశ ప్రజల కొనుగోలు శక్తి కూ డా 4.6 శాతానికి పడిపోయిందని, ఇంతటి దారుణమైన పరిస్థితులు మునుపెన్నడూ లేవ ని నివేదిక పేర్కొంది.

ద్రవ్యోల్బణం తీవ్రరూ పం దాల్చిందని, ప్రజల పొదుపు చర్యలు భారీగా పడిపోయాయని, చుక్కలనంటిన ధరలతో దేశ ప్రజల కొనుగోలు శక్తి కూడా దారుణంగా పడిపోయిందని, ఈ మొత్తం పరిణామాలన్నీ దేశ ప్రజలు ఎంతటి ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయారో స్పష్టంచేస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. ప్రజల ఆర్థిక ఎదుగుదల కూడా చాలా తక్కువగా ఉందని, అందుకే ద్ర వ్యోల్బణం తీవ్రరూపం దాల్చిందని, ఈ పరిస్థితులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం “అచ్చే దిన్‌” గా పరిగణిస్తోందని మోతీలాల్ ఓస్వాల్ నివేదికలో ఎద్దేవా చేశారు. కొనుగోలు శక్తి లేక, పొదుపు చేయలేక దేశ ప్రజలు అష్టకష్టాలు ప డుతున్నారని, వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థ్ధిక విధానాలే ప్రధాన కారణాలని, ఆర్థ్ధికవేత్త మోతీలాల్ ఓస్వాల్ చేసిన అధ్యయనం దేశంలో ప్రస్తుతం నెలకొన్న దుర్భర పరిస్థితులకు నిలువెత్తు నిదర్శనమని, కేం ద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమై న ఆర్థ్ధిక విధానాల మూలంగా ఎకనామిక్ యాక్టివిటీ (ఆర్థ్ధికకార్యకలాపాలు) లేకపోవ డం మూలంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి లక్షలాది కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఇబ్బడి ముబ్బడిగా ప న్నులు పెంచుకొంటూ పోవడం, సెస్- సర్‌ఛార్జీ ల పేరుతో అదనపు పన్నులను విధించడం, పే ద వర్గాలు, సామాన్య ప్రజలు దగ్గర్నుంచి చివరకు ధనికులు సైతం మోయలేనంతగా పెట్రో ల్, డీజిల్ ధరలను ఆకాశమే హద్దుగా పెంచ డం, ఈ పెంపుదల కారణంగా దేశ ప్రజల ని త్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతోనే ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయిందని, దీంతో పొదుపు చర్యలు కూ డా లేకుండా పోయాయని వివరించారు. ఎమిదేళ్ల క్రితం వరకూ ఒక సామాన్యుడు నెలకు ఇంటి అవసరాలకు, నిత్యావసర వస్తువులకు రూ.10 వేలు

ఖర్చు చేస్తే నేడు అవే వస్తువులు, పదార్ధాలకు ప్రస్తుతం 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇలా జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయిందని ఆర్ధికవేత్తలు, సీనియర్ అధికారులు సైతం మండిపడుతున్నారు. అంతెందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలపై విధిస్తున్న పన్నుల భారాన్ని మోయలేక ఏకంగా 2.80 లక్షల మంది బిలియనీర్లు (కోటీశ్వరులు) దేశ పౌరసత్వాన్ని కూడా వదులుకొని, తమతమ కంపెనీలను కూడా భారతదేశం నుంచి ఇతర దేశాలకు తరలించుకొనిపోయారని, ఈ చర్యలే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థ్ధిక విధానాలను అవలంబిస్తుందో రుజువు చేస్తున్నాయని వివరించారు.

అంతేగాక సామాన్య ప్రజలు వినియోగించే లీటర్ ప్రెటోల్ ధర హైదరాబాద్ నగరంలో 109 రూపాయలుంటే అదే విమానాల్లో వినియోగించే ఇంధనం లీటర్ 80 రూపాయలు (విమర్శలు వెల్లువెత్తడంతో ఈ మధ్యనే విమానాల ఫ్యూయల్‌ను లీటర్‌కు 109 రూపాయలకు పెంచారు) ఉండిందని, దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తప్పుడు ఆర్ధిక విధానాలను అవలంభిస్తుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చునని వివరించారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు 169 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని, ఈ అప్పులకు వడ్డీల రూపంలో చెల్లింపులు చేసేందుకే కేంద్రం ఈ ఏడాదిలో 9.4 లక్షల కోట్ల రూపాయలను కేటాయించుకొందని వివరించారు. గత ఎనిమిదేళ్ళల్లో కేంద్రం రికార్డుస్థాయిలో సుమారు 80 లక్షల కోట్ల రూపాయలను అప్పులుగా తెచ్చిందని, కానీ ఇంతటి భారీ మొత్తంలో దొరికన చోట దొరికినట్లుగా అప్పులుచేసి ఏం సాధించారో ఎవ్వరికీ అంతుబట్టడంలేదనే విమర్శలున్నాయి.

అప్పులుగా తెచ్చిన నిధులను అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలకు కాకుండా రక్షణ రంగానికి, ఇతరత్రా అనుత్పాదక రంగాలకు ఖర్చు చేయడంతోనే ఇంతటి సంక్షోభం తలెత్తిందని ఆక్షేపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆకాశమే హద్దుగా పన్నులు, భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న దేశ ప్రజల ఆర్థ్ధిక స్థితిగతులను పెంపొందించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడంతోనే కొనుగోలుశక్తి పూర్తిగా పడిపోయిందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ధనవంతులు సైతం మోయలేనంతగా పన్నులు వేసి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడమే అభివృద్ధ్దా… ఆకాశమే హద్దుగా ధరలు పెంచి ప్రజల కొనుగోలు శక్తిని హరించి వేయడమే బిజెపి మార్కు అభివృద్ధా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశంలో ఎకనమిక్ యాక్టివిటీ (ఆర్థ్ధిక కార్యకలాపాలు) లేకుండా, ఆర్థ్ధికాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయకుండా, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేయడమే బిజెపి మార్కు అభివృద్ధ్దా… సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ఎలాంటి ప్రాజెక్టులను చేపట్టకపోవమే అభివృద్ధా…

దేశంలో 14,700 గ్రామాలకు ఇప్పటికీ కరెంటు బల్బు అంటే ఏమిటో కూడా తెలియదని, కొత్తగా ఒక్క మెగావాట్ కరెంట్‌ను ఉత్పత్తి చేసే సామర్ధాన్ని పెంచకపోవడమే బిజెపి మార్కు అభివృద్ధా అని మండిపడ్డారు. దేశంలో 72 వేల టిఎంసిల నదీ జలాలున్నప్పటికీ ఒక్క టిఎంసి నీటిని కూడా అదనంగా వినియోగంలోకి తీసుకురాకపోవమే కమలం పార్టీ మార్కు అభివృద్ధ్దా అని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పే “అచ్చే దిన్‌”లో భాగమేనా? అని ఆర్థ్ధిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాలన అంటే పన్నులు పెంచడం, ధరలు పెంచడం, సెస్-సర్‌చార్జిల పేరుతో అదనపు పన్నులు వసూలు చేయడమే అనే ధోరణితో కేంద్రంలో బిజెపి పాలనసాగుతోందని, అందుకే ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థ్ధికవేత్తలు, సీనియర్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కాకుండా ఆహార భద్రతలో లబ్ధిదారులను తగ్గించడం, కూలీలకు నష్టం వాటిల్లే విధంగా ఉపాధి హామీ పనిదినాలను తగ్గించడం, తాగునీటి సరపరాకు నిధులను తగ్గించడం, గ్రామీణాభివృద్ధి రంగాలకు ఇచ్చే నిధుల్లో కోతలు విధించడం, రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలను కూడా నాశనం చేసే విధంగా వ్యవహరించడం, రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో కోతలు విధించడం కోసం సెస్-సర్‌చార్జీల పేరుతో భారీగా పన్నులు వేయడం వంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘోరమైన తప్పిదాలకు పాల్పడుతోందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News