Monday, January 20, 2025

ఐటి పోర్టల్‌ను వదలని ఇక్కట్లు

- Advertisement -
- Advertisement -

Taxpayers face issues accessing e-filing portal

ఇ ఫైలింగ్‌లో యూజర్లకు తప్పని కష్టాలు
సమస్యను ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లాం: ఐటి శాఖ

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదార్లకు మెరుగైన సేవలు అందించడం కోసం ఆదాయం పన్ను శాఖ కొత్త ఇఫైలింగ్ పోర్టల్‌ను తీసుకువచ్చి ఏడాది గడిచినప్పటికీ బాలారిష్టాలు అధిగమించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఐటి రిటర్న్‌లు దాఖలు వేళ ఈ పోర్టల్ మరోసారి యూజర్లకు చుక్కలు చూపిస్తోంది. దీంతో ఫిర్యాదులు వెల్ల్లువెత్తుతున్నాయి.దీనిపై స్పందించిన ఐటి శాఖ ఈ విషయాన్ని పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది.‘ ఐటి శాఖకు చెందిన ఇఫైలింగ్ పోర్టల్‌తో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మా దృష్టికి వచ్చింది.

ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లాం. అసాధారణ ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తాయని తెలిపిన సంస్థ తగిన చర్యలు తీసుకుంటోంది’ అని ఐటి శాఖ ట్వీట్ చేసింది. ఐటి శాఖ కొత్త ఇఫైలింగ్ పోర్టల్‌ను 2021 జూన్ 7న తీసుకొచ్చింది.ఆ ఏడాది ఐటి సైట్‌లో అనేకసార్లు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం ఐటి రిటర్న్‌ల దాఖలు తుది గడువును అనేక సార్లు పొడిగించాల్సి వచ్చింది. ఇటీవల ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలోనూసెర్చ్ ఆప్షన్ సరిగా పని చేయకపోవడంపై ఐటి శాఖకు ఫిర్యాదులు అందాయి.ఐటి ఫైలింగ్ పోర్టల్‌ను రూపొందించే కాంట్రాక్ట్‌ను 2019లో ఇన్ఫోసిస్ దక్కించుకుంది. ఇందుకుగాను ప్రభుత్వం సంస్థకు రూ.164.5 కోట్లు చెల్లించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News