Monday, January 20, 2025

టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం ఉద్యోగులకు పెంచిన జీతాలు చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

గోషామహల్: వైద్య ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్‌లో టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీవో నెం. 510 ద్వారా పెంచిన జీతాలు చెల్లించాలని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ హెచ్=1 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి తెలంగా ణ రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశంను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హెచ్=1 యూనియన్ ప్రతినిధులతో కలిసి డాక్టర్ రాజేశంను కలిసి వినతిపత్రం అందజేసి, వీలైనంత త్వరగా పెంచిన జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్బంగా కర్నాటి సాయి రెడ్డి మీడియా తో మాట్లాడుతూ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నా కూడా తెలంగాణ రాష్ట్రా న్ని టీబీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిషలూ శ్రమిస్తున్న టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం ఉద్యోగులను ప్రభుత్వం విస్మరించడం శోచనీయమన్నారు . టీబీ ఉద్యోగుల సేవలను గుర్తించి వారిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు బేసిక్ పే అమలు చేయాలని, ఈహెచ్‌ఎస్, రిస్క్ అలవె న్స్‌లు, ఇతర పెండింగ్ లో ఉన్న బిల్లులు అన్నింటినీ చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి రాజశేఖర్, ఆప్తాబ్ అహ మ్మద్ ఖాన్, కృష్ణ, రవి, టీబీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సందీప్, సురేష్, ప్రసాద్, జగత్, కిరణ్, భిక్షపతి తదితరులు రవి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News