Sunday, December 22, 2024

ఇంజక్షన్ వేసుకొని వైద్యుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముంబయి: మత్తు ఇంజక్షన్ వేసుకొని ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని సెవ్రి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జల్‌గడ్ జిల్లాకు చెందిన ఆదినాథ్ పాటిల్ అనే వైద్యుడు కెఇఎం మెడికల్ కాలేజీలో పిజి చేస్తున్నాడు. టిబి ఆస్పత్రిలో పాటిల్ విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం డాక్టర్లు 8.30 టిబి ఆస్పత్రికి చేరుకున్న తరువాత జనరల్ వార్డులో రోగులను పరీక్షించి మెడిసిన్ ఇచ్చారు.

Also Read: మంత్రి కొప్పులకు హైకోర్టులో చుక్కెదురు..

వైద్యులు తన రూమ్‌కు వెళ్లి భోజనం చేశారు. ఆదినాథ్ పాటిల్ రూమ్‌కు నర్సులు వెళ్లేసరికి అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని ఐసియుకు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతడి క్లాస్‌మెంట్స్, స్నేహితులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది. పాటిల్ తండ్రి ఎక్‌వీర ఆస్పత్రిని స్థాపించి డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కెఇఎం ఆస్పత్రికి సంబంధించిన మెడిసిన్‌ను టిబి ఆస్పత్రికి తరలించారు. మెడిసిన్ డిపార్ట్‌మెంట్ వారు నాలుగు రకాల ఔషధాలు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కు తీసుకెళ్తున్నప్పుడు ఇంజక్షన్ తీసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News