Monday, December 23, 2024

టొరంటోలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కెనడా అసోసియేషన్(TCA) ఆధ్వర్యంలో టొరంటో-కెనడా నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 2500కు పైగా తెలంగాణ వాసులు స్థానిక లింకన్ అలెగ్జాండర్ సెకండరీ స్కూల్ – మిస్సిసాగాలో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు.

ఈ సంవత్సరం విశేష స్పందనతో అనూహ్య విధంగా బతుకమ్మలను తీసుకువచ్చి టొరంటో తెలంగాణ ప్రజలు బతుకమ్మలపై వారికి ఉన్న భక్తిని చాటుకున్నారు. పలు వంటకాలతో పాట్ లాక్ విందు భోజనం సమకూర్చారు. తెలంగాణ కెనడా సంఘం ఈ సందర్భంగా వారి అధికారిక తెలుగు పత్రిక TCA బతుకమ్మ సంచికను గుప్తేశ్వరి వాసుపిల్లి ఆవిష్కరించి ముందుగా పాలకామండలి ఆడపడుచులకు అందజేశారు. ఈ సంబరాలలో బతుకమ్మ ఆట పాటలతో సుమారు 5 గంటలు ఏకధాటిగా సంబరాలు చేసుకున్నారు.  చివరగా పోయిరావమ్మ గౌరమ్మ పాటతో ఊరేగిపుంగా వెళ్లి నిమజ్జనం చేశారు. తరువాత సత్తుపిండి, నువ్వుల పిండి, పల్లీల పిండి ప్రసాదం పంపిణి చేసారు.

ఈ సంవత్సరం బతుకమ్మలలో అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి విజేతలకి విభూతి ఫ్యాబ్ స్టూడియోస్ వారు, తెలంగాణ కెనడా అసోసియేషన్ వారు బహుమతులను అందజేశారు. బతుకమ్మ పండుగకి విచ్చేసిన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలిచిన వారికి ఒక గ్రాము బంగారం బహుమతిగా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమం చివర్లో అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు సహకరించిన టొరంటో తెలుగు ప్రజల్ని అభినందించారు. స్వచ్ఛంద స్వచ్ఛంద సేవకులను, గవర్నింగ్ బోర్డ్ సహకారాలని ఎంతో కొనియాడారు. చివరగా తెలంగాణ కెనడా అసోసియేషన్ స్పాన్సర్లకు, డిన్నర్ పాట్ లాక్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News