Monday, January 20, 2025

టిసిఈఐ ఎస్‌ఐడబ్ల్యుపిసి అవార్డుల ప్రదానం బ్రోచర్

- Advertisement -
- Advertisement -
ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద రీజినల్ ఈవెంట్స్ అసోసియేషన్‌లలో ఒకటైన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టిసిఈఐ) ,ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ (టిసిఈఐ ఎస్‌ఐడబ్ల్యుపిసి ) గ్లోబల్ 2023 సదస్సును, టిసిఈఐ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి హైటెక్స్‌లో ఈ నెల 24 , 25వ తేదీలలో అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు తెలంగాణ టూరిజం శాఖ సహకారం అందిస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ , గౌరవ అతిథిగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తానియా గురువారం పర్యాటక భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డుల వివరాల బ్రోచర్‌ను ఆవిష్కరించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ తెలంగాణ వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నందుకు అభినందనలు తెలిపారు.

ఈవెంట్ ప్లానర్ల ప్రమేయం లేకుండా ఏ వేడుక, ఈవెంట్ లేదా ప్రోగ్రామ్ జరగదని అన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నాయకత్వంలో తెలంగాణలో ప్రతి పరిశ్రమ వేగంగా పురోగతి సాధించిందని ఈవెంట్ ఇండస్ట్రీ కూడా ముందంజలో ఉన్నదని అన్నారు. ప్రతిష్టాత్మకమైన టిసిఈఐ ఎస్‌ఐడబ్ల్యుపిసి గ్లోబల్ 2023 సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈవెంట్ ఇండస్ట్రీకి చెందిన నలభై మందికి పైగా ప్రముఖ వరల్డ్ లీడర్లు తమ అనుభవాలు ఆలోచనలను పంచుకుంటారని, ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందజేస్తుందని అన్నారు.

ఈవెంట్ పరిశ్రమ నుండి జీవనోపాధి పొందే అనేక చిన్నమధ్యస్థ వ్యాపారవేత్తలు ఉన్నారని తద్వారా పరిశ్రమ మొత్తం వ్యవస్థను అభివృద్ధి చేసేలా చేస్తుందని, ఇది ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహకాలు అయినా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం రాజస్థాన్ మరియు విదేశాలకు వెళుతున్నారని, అయితే మన వద్ద అత్యంత అద్భుతమైన ప్రదేశాలు, ప్రపంచ ప్రఖ్యాత ప్యాలెస్‌లు ఉన్నాయని అన్నారు. ప్రజలు వీటి గురించి తెలుసుకుని వాటిని ఉపయోగించుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ బిజినెస్ హెడ్ టిజి. శ్రీకాంత్ , టిసిఈఐ ప్రెసిడెంట్ బలరామ్ బాబు , జనరల్ సెక్రటరీ రవి బూర , ఎస్‌ఐడబ్ల్యుపిసి కన్వీనర్ శ్రవణ్ మాదిరాజు , టిసిఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్ కన్వీనర్ రమేష్ ముప్పన తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News