Monday, December 23, 2024

మరో బిగ్ కంపెనీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టిసిఎల్ తెలంగాణలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కలిసి రిసోజెట్ సంస్ధతో కలసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు సమక్షంలో తెలంగాణ కంపెనీ రిసోజెట్ తో టిసిఎల్ సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తెలంగాణ కంపెనీ రిసోజెట్ తో కలిసి టిసిఎల్ ఒక జాయింట్ వెంచర్ సంస్థ రూపంలో ప్రపంచ స్థాయి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కన్జ్యూమర్ ప్రొడకట్స్ రంగంలో విస్తృత ఉత్పత్తుల శ్రేణిని కలిగిన టిసిఎల్ ఎలక్ట్రానిక్స్ తన ప్రధాన కేంద్రం అయిన చైనాలోని హెఫెయి నగరం తర్వాత విదేశంలో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్ ఇదే కావడం విశేషం.

తొలుత వాషింగ్ మెషిన్లను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఈ తయారీ కేంద్రం నుంచి సమీప భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్లను కూడా ఉత్పత్తి చేసేందుకు విస్తరించనున్నది.రంగారెడ్డిలోని రావిర్యాల్లో ఉన్న ఈ- సిటీలో ఏర్పాటు చేయనున్న తయారీ యూనిట్ కోసం టిసిఎల్ సంస్ధ 225 కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెట్టనున్నది. ఈ తయారీ యూనిట్ ద్వారా సుమారు 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు తొలిదశలోనే రానున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి టిసిఎల్ కంపెనీని స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి కెటిఆర్, తెలంగాణ రాష్ట్ర కంపెనీ అయిన రిసోజెట్ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా టిసిఎల్ కంపెనీతో కలిసి ముందుకు వెళ్లడం విశేషం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం నుంచి హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి అవకాశం ఉందని, ఈరోజు టిసిఎల్ కంపెనీ పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ రంగంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీకి అత్యంత అనువైన ప్రాంతమని, ఈరోజు టిసిఎల్ కంపెనీ తెలంగాణలో తమ ఉత్పత్తులను తయారు చేసేందుకు ముందుకు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు.అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న రిసోజెట్ కంపెనీ యండి రమీందర్ సింగ్ సోయిన్ మరియు టిసిఎల్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. టిసిఎల్ తయారీ యూనిట్ కి అవసరమైన అన్ని రకాల సహకారం రాష్ట్రం అందిస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని షెన్జన్ ఆఫ్ ఇండియా గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నదని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను, టి సి ఎల్ సంస్థ చైర్మన్ జువాన్ డూ కి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ విధానానికి ఉన్న అనుకూల పరిస్థితులు, మౌలిక వసతుల రంగంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని ఆమెను తెలంగాణకు కెటిఆర్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కంపెనీ రిజల్యూట్ గ్రూప్ చైర్మన్ రమీందర్ సింగ్ సొయిన్, తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజాయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News