టెలివిజన్, గృహోపకరణాల పరిశ్రమలో మహోన్నత వారసత్వం కలిగిన అంతర్జాతీయ అగ్రగామి సంస్థ టిసిఎల్, 10 అక్టోబర్ 2023న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తమ పూర్తి ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల కొత్త ఉత్పత్తి లైన్‌ను విడుదల చేసింది. విస్తృత శ్రేణి వాషింగ్ మెషీన్‌లతో పెద్ద ఉపకరణాల కేటగిరీలో అగ్రగామి సంస్థలలో ఒకటిగా వెలుగొందుతున్న టిసిఎల్, భారతీయ మార్కెట్‌లో కొత్త శ్రేణి ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లను సగర్వంగా పరిచయం చేసింది. ఈ వాషింగ్ మెషీన్స్ విడుదల పట్ల తన ఆనందం వ్యక్తం చేసిన టిసిఎల్ సీఈఓ ఫిలిప్ జియా మాట్లాడుతూ.. “కస్టమర్ సెంట్రిసిటీ అనేది మా వ్యాపార వ్యూహంలో ప్రధానమైనది. భారతదేశంలోని హైదరాబాద్‌లో పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల కోసం అత్యాధునిక తయారీ యూనిట్‌ను కలిగి ఉన్నందున, మా విలువైన కస్టమర్‌ల కోసం అత్యంత సరసమైన ధరలకు ప్రత్యేకమైన ఫీచర్‌లతో కూడిన కొత్త శ్రేణి వాషింగ్ మెషీన్‌లను తీసుకు రావడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఇది వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి మాకు తగిన అవకాశం అందిస్తుంది” అని అన్నారు.
పెరుగుతున్న పట్టణీకరణ, అధిక డిస్పోసల్ ఆదాయాలు, కొనుగోలు సౌలభ్యం వంటివి పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల కు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న భారతీయ కస్టమర్ల ఆకాంక్షలను తీర్చడానికి టిసిఎల్ ఇప్పుడు విస్తృత శ్రేణి ఫీచర్ లు కలిగిన , సరికొత్త శ్రేణి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. కొత్త ఉపకరణాల కేటగిరీని ప్రారంభించడంలో భాగంగా, టిసిఎల్ పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల శ్రేణిని పరిచయం చేస్తోంది. ఫ్రంట్ లోడింగ్ F12 సిరీస్ వాషర్ & డ్రైయర్ కాంబో, P6 సిరీస్ ఫ్రంట్ లోడింగ్ వాషర్ లు వరుసగా BLDC మోటార్, స్మార్ట్ DD మోటార్ తో మిళితమై ఉంటాయి.F- సిరీస్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్లు భారతీయ కస్టమర్ల అవసరాలు, ఆకాంక్షలను తీర్చడానికి అధునాతన ఫీచర్లతో రూపుదిద్దుకున్నాయి. దీంతో పాటుగా, TCL ఇప్పుడు 7 కిలోల నుండి 9.5 కిలోల కెపాసిటీ, అధునాతన ఇంటిగ్రేటెడ్ ఫీచర్‌లతో కూడిన విస్తారమైన ట్విన్ టబ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లను కూడా పరిచయం చేస్తుంది.
ఈ నూతనంగా విడుదల చేయబడిన ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు “మేక్-ఇన్-ఇండియా” కార్యక్రమం కింద హైదరాబాద్‌లోని ఇ-సిటీలో ఉన్న టిసిఎల్ యొక్క అత్యాధునిక ఫ్యాక్టరీ, Resojet Pvt Ltdలో తయారు చేయబడుతున్నాయి. Resojet కర్మాగారం TCL వాషింగ్ మెషీన్ల తయారీ, ఇంజనీరింగ్, ప్రక్రియ, అంతర్జాతీయ నాణ్యతను దృష్టిలో ఉంచుకునే అధునాతన సాంకేతికతలను కలిగి ఉంది. సంవత్సరానికి 600000 యూనిట్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎగువ పథంలో కదులుతున్న TCL, భారతీయ వాషింగ్ మెషీన్ మార్కెట్‌లో దాని వ్యాప్తిని పెంచడానికి బలమైన పంపిణీ, విక్రయ వ్యూహాన్ని అనుసరిస్తుంది. భారతదేశంలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ సేల్స్ ఛానెల్‌ల ద్వారా మినీ LED, QLED, 4K స్మార్ట్ టీవీ విభాగంలో TCL ఇప్పటికే బలంగా తన సత్తా చాటుతుంది. TCL అన్ని విభాగాలలో దాని అద్భుతమైన ఉత్పత్తుల శ్రేణితో అధిక దృశ్యమానతను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.
TCL అనేది ప్రత్యేకమైన మార్కెటింగ్ ప్రయత్నాలతో పాటు బలమైన బ్రాండ్ అవగాహనను సృష్టించడంపై అవిశ్రాంత ప్రయత్నాలు, నిరంతర దృష్టితో భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్. ఇది బలమైన, సమర్థవంతమైన విక్రయాల-సేవా నెట్‌వర్క్‌తో వినియోగదారుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి సౌకర్యవంతమైన, సురక్షితమైన ఉత్పత్తి డెలివరీ ఛానెల్‌ల ఏకీకరణపై నిరంతరం పని చేస్తోంది. పరివర్తనాత్మక కస్టమర్ అనుభవం కోసం వివిధ ఉత్పత్తి వర్గాలలో సరికొత్త సాంకేతిక ఉత్పత్తులను అందించడంలో టిసిఎల్ ముందుంది. ఎలక్ట్రానిక్స్, భారీ ఉపకరణాల యొక్క అన్ని విభాగాలలో ప్రముఖ గ్లోబల్ ప్లేయర్ గా టిసిఎల్ ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో గత 43 సంవత్సరాలుగా తన కస్టమర్‌లను ఉత్తేజపరుస్తుంది, ఆకట్టుకుంటుంది.