Monday, December 23, 2024

ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి షాక్…!

- Advertisement -
- Advertisement -

కోమటిరెడ్డిని పక్కకు తప్పించిన అధిష్టానం
ఏ కమిటీలోను కోమటిరెడ్డికి దక్కని చోటు
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీతారెడ్డి తొలగింపు
18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు
26 మంది జిల్లా అధ్యక్షులు, 8 మంది జనరల్ సెక్రటరీలు

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ పార్టీ అధిష్టానం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రస్థాయి నుంచి జిల్లాల కమిటీల వరకు సుమారు 80 మంది నేతలకు పార్టీ పదవుల ఇశ్తూ అధిష్టానం ఉత్తర్వుఉల జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టిపిసిసి కమిటీలను ప్రకటించింది. మాణిక్యం ఠాగూర్‌ను పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ పద్దెనిమిది మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈసారి నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డికి అధిష్టానం పెద్ద షాక్ ఇచ్చింది. ఏ కమిటీలోనూ ఆయనకు స్థానం కల్పించలేదు. నిన్నమొన్నటి వరకు టిపిసిసి ప్రచార కమిటీలో స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీలో ఓ వెలుగు వెలిగిన కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ఈసారి పూర్తిగా పక్కన పెట్టారు.

ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్న మాజీ మంత్రి జె. గీతారెడ్డిని తొలగించారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించనున్న 40 మంది కార్యనిర్వాణ కమిటీలో సభ్యురాలిగా గీతారెడ్డికి స్థానం కల్పించారు. ఈ మేరకు శనివారం ఎఐసిసి అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేత చర్యలో భాగంగా రాష్ట్రస్థాయి నుంచి కిందిస్థాయి వరకు నేతలకు బాధ్యతలను అప్పగిస్తూ ఈ కమిటీలను ఎఐసిసి నియామకం చేసింది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 18 మందితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురు, జనరల్ సెక్రటరీలుగా ఎనిమిది మంది, కార్యానిర్వహాక కమిటీలో 40 మంది, జిల్లా అధ్యక్షులుగా 24 మంది, వైస్ ప్రెసిడెంట్లుగా 24 మందిని ఎఐసిసి నియమించింది.

డిసిసి ప్రెసిడెంట్లు.. సజీద్ ఖాన్ (అదిలాబాద్), పోడెం వీరయ్య (భద్రాది కొత్తగూడెం), ఎన్. రవీందర్ రెడ్డి (హనుమకొండ), వాలిలుల్లా సమీర్ (హైదరాబాద్), ఎ. లక్ష్మణ్ కుమార్ (జగిత్యాల), పటేల్ ప్రభాకర్ రెడ్డి (జోగులాంబ గద్వాల్ ), కైలాస్ శ్రీనివాస్ రావు(కామారెడ్డి), డాక్టర్ కె. సత్యనారాయణ (కరీంనగర్), డాక్టర్ సి. రోహిణి రెడ్డి (ఖైరతాబాద్), జె. భారత్ చంద్రా రెడ్డి (మహబూబాబాద్), జి. మధుసుధన్ రెడ్డి (మహబూబ్‌నగర్), కె. సురేఖ (మంచిర్యాల), తిరుపతి రెడ్డి (మెదక్ ), నందికంటి శ్రీధర్ (మేడ్చెల్ మల్కాజిగిరి), ఎన్. కుమార్ స్వామి(మలుగు), డాక్టర్ సి. వంశి క్రిష్ణ, (నాగర్ కర్నూల్), టి. శంకర్ నాయక్ (నల్గొండ), శ్రీహరి ముదిరాజ్ (నారాయణ పేట), ప్రభాకర్ రెడ్డి (నిర్మల్), మనాల మోహన్ రెడ్డి (నిజామాబాద్), ఎం.ఎస్. రాజ్ టాకూర్ (పెద్దపల్లి), ఆది శ్రీనివాస్ (రాజన్న సిరిసిల్ల), టి. నర్సా రెడ్డి (సిద్ధిపేట), టి. రామ్మోహన్ రెడి ్డ(వికారాబాద్), ఎం. రాజేందర్ ప్రసాద్ యాదవ్ (వనపర్తి), కె. అనిల్ కుమార్ రెడ్డి (యాదాద్రి భువనగిరి) నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News