Wednesday, January 22, 2025

టిసిఎస్ లో ఆఫీసు నుంచి పనిచేస్తేనే బోనస్!

- Advertisement -
- Advertisement -

60 శాతం కన్నా తక్కువ అటెండెన్స్ ఉద్యోగులకి బోనస్ దక్కదు

హైదరాబాద్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఆఫీసు నుంచి పనిచేసే వారికే వార్షిక బోనస్ లింక్ పెట్టింది. అయితే 60 శాతం కన్నా తక్కువ అటెండెన్స్ ఉండే ఉద్యోగులకు బోనస్ ఉండదు.

వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పనిచేసే వారికి 85 శాతం కన్నా ఎక్కువ అటెండెన్స్ ఉంటే 100 శాతం బోనస్, 75 శాతం నుంచి 85 శాతం అటెండెన్స్ ఉండే వారికి 75 శాతం బోనస్, 60 శాతం నుంచి 75 శాతం అటెండెన్స్ ఉండే వారికి 50 శాతం బోనస్ లభించనున్నది.  60 శాతం కన్నా తక్కువ ఉండే వారికి ఎలాంటి పర్ఫామెన్స్ బోనస్ దక్కదు.

కరోనా మహమ్మారి సమయంలో ఇంటి నుంచి పనిచేయడానికి టిసిఎస్ అనుమతించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఆఫీసుకు వచ్చి పనిచేయమంటోంది. అందుకే ఈ బోనస్ లింక్ కూడా కొత్తగా పెట్టింది.

Updated Norms

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News