Sunday, December 22, 2024

టిసిఎస్ లాభం తొలిసారిగా రూ.10,000 కోట్లు దాటింది

- Advertisement -
- Advertisement -

TCS profit crossed Rs.10000 crore for the first time

గతేడాదితో పోలిస్తే క్యూ2లో 8% వృద్ధి, 18 శాతం పెరిగిన ఆదాయం
షేరుకు రూ.8 చొప్పున డివిడెండ్

న్యూఢిల్లీ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసికం ఫలితాల్లో ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202223) క్యూ2(జూలైసెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం రూ.10,431 కోట్లతో 8 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.9,624 కోట్లుగా ఉంది. పటిష్టమైన డీల్‌లను పొందడం వల్ల కంపెనీ లాభా ల్లో మంచి వృద్ధిని సాధించింది. 202223 మొదటి త్రైమాసికంలో లాభం రూ.9478 కోట్ల కంటే 10 శాతం ఎక్కువగా ఈసారి లాభం వచ్చింది. టిసిఎస్ సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ, కంపెనీ సేవలకు డిమాండ్ చాలా బలంగా కొనసాగుతోందని, పరిశ్రమ పరంగా సంస్థ లాభాలు, వృద్ధిలో పటిష్టంగా ఉందని అన్నారు. కంపెనీ వాటాదారులకు డివిడెండ్ ప్రకటించింది. ప్రతి షేరుకు రూ.8 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను టిసిఎస్ బోర్డు సమావేశంలో ఆమోదించింది.

రెండో త్రైమాసికంలో టిసిఎస్ ఆదాయం 18 శాతం పెరిగి రూ.55,309 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.46,867 కోట్లుగా ఉంది. అదే సమయంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆదాయం రూ.52,758 కోట్లుగా నమోదైంది. రెండో త్రైమాసికంలో 9,840 మంది కొత్తవారిని కంపెనీ నియమించుకోగా, దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,16,171కి చేరిందని టిసిఎస్ తెలిపింది. రెండో త్రైమాసికంలో కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో అట్రిషన్ రేటు 21.5 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 17.4 శాతం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 19.7 శాతంగా ఉంది. ఇక్కడి నుంచి అట్రిషన్ రేటు తగ్గే అవకాశం ఉందని టిసిఎస్ ఆశాభావం వ్యక్తం చేసింది. మార్కెట్ ముగిసిన తర్వాత టిసిఎస్ ఫలితాలను ప్రకటించింది. మార్కెట్లో కంపెనీ షేరు 2 శాతం లాభంతో రూ.3,121 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News