Sunday, November 3, 2024

చరిత్ర సృష్టించిన టిసిఎస్

- Advertisement -
- Advertisement -
TCS second most valuable it brand in world
ప్రపంచంలో రెండో అత్యంత విలువైన ఐటి బ్రాండ్‌గా అవతరణ
రెండో స్థానంలో ఇన్ఫోసిస్
నాలుగో స్థానానికి పడిపోయిన ఐబిఎం
బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) ప్రపంచం వ్యాప్తంగా ఐటి సేవల రంగంలో రెండో అత్యంత విలువైన సంస్థగా అవతరింది. రెండో స్థానంలో టిసిఎస్, మూడో స్థానంలో ఇన్ఫోసిస్‌లు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్‌లో అమెరికా ఐటి సంస్థ ఐబిఎం నాలుగో స్థానానికి పడిపోయింది. భారతదేశ ఐటీ కంపెనీలు 2020 నుంచి 2022 మధ్య అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించాయి. బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక ప్రకారం, అత్యంత విలువైన ఐటి సేవల బ్రాండ్‌గా యాక్సెంచర్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాన్ని టిసిఎస్ దక్కించుకుంది. ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ కూడా 12.8 బిలియన్ డాలర్లతో 3 ర్యాంక్‌ను చేరుకుని, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా మారింది.

ఈ జాబితాలో భారత్‌కు చెందిన మరో నాలుగు టెక్ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిలో విప్రో, హెచ్‌సిఎల్, టెక్ మహీంద్రా, ఎల్‌టిఐ ఉన్నాయి. మొత్తం 6 ప్రధాన భారతీయ బ్రాండ్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 ఐటి సేవల బ్రాండ్‌లలో స్థానం పొందాయి. ఈ ర్యాంకింగ్ 2020-22కి చెందినది. నివేదిక ప్రకారం, యాక్సెంచర్ బ్రాండ్ విలువ 36.2 బిలియన్ డాలర్లు ఉంది. గత 12 నెలల్లో టిసిఎస్ బ్రాండ్ విలువ 1.844 బిలియన్ డాలర్లు (12.5 శాతం) పెరిగి 16.786 బిలియన్ డాలర్లకు (రూ.1.26 లక్షల కోట్లు) చేరుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ సిఇఒ, ప్రెసిడెంట్ డేవిడ్ హేగ్ మాట్లాడుతూ, తొలిసారిగా ఈ రంగంలో రెండో అత్యంత విలువైన బ్రాండ్‌గా టిసిఎస్ అవతరించిందని అన్నారు. గత సంవత్సరం టిసిఎస్ తన ప్రపంచ బ్రాండ్ విలువను పెంచుకుంది. నిరంతర పెట్టుబడి కారణంగా కంపెనీ ఈ స్థానాన్ని సాధించింది. ప్రస్తుతం వ్యాపారంలో ఇంటి నుంచి పని చేయడం సాధారణమైందని బ్రాండ్ ఫైనాన్స్ తన నివేదికలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News