Sunday, January 19, 2025

వాలంటీర్ల తీరుతో చాలా ప్రమాదం పొంచి ఉంది: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎవరెవరో మాట్లాడిన వాటిపై స్పందించి చులకన కాదల్చుకోలేదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. బిజెపితో టిడిపి పొత్తు ఉంటుందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు స్పందించారు. దగాపడ్డ ఎపి రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమన్నారు. ఆంధ్ర ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సెట్ చేయడమే తన లక్షమని స్పష్టం చేశారు. పెద్ద బాధ్యత తనపై ఉన్నప్పుడు పెద ఆలోచనలు చేయడం అవసరమని నొక్కి చెప్పారు. పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read:  వరుడు అక్కడ..వధువు మరెక్కడో..పెళ్లి జరిగిపోయింది !

సిఎం జగన్ ఆ స్థాయి పోరాటానికి కనీస ప్రయత్నం చేశారా? అని నిలదీశారు. ఓట్ల అవకతవకలపై ఢిల్లీని కూడా వదిలిపెట్టబోమని, అక్రమాలు సరిదిద్దకపోతే ఇసి విశ్వసనీయత కోల్పోతుందన్నారు. వాలంటీర్ల పౌరసేవకు పరిమితం కావాలని, వాలంటీర్లు రాజకీయ జోక్యం చేసుకుంటే కుదరదన్నారు. వాలంటీర్ల వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమని చంద్రబాబు దుయ్యబట్టారు. వాలంటీర్ల తీరుతో చాలా ప్రమాదం పొంచి ఉందని, అధికారంలోకి వస్తే ప్రజసేవ వరకే వాలంటీర్ల సేవలు పరిశీలిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News