Wednesday, January 22, 2025

టిడిపి, కాంగ్రెస్ వేరుకాదు: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి చేసిన సాయానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి థాంక్స్ చెప్పారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి నిద్రపోయారేమో కానీ టీడీపీ వారు మాత్రం నిద్రపోకుండా పనిచేశారని ప్రశంసించారు. ప్రస్తుతం టిడిపి, కాంగ్రెస్ వేరు కాదు అని రెండు ఒకటేనని చెప్పారు. టిడిపి అధికారంలో లేదని ఎవరూ బాధ పడొద్దని సూచించారు. టిడిపోళ్లు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోము అని, భవిష్యత్తు రాజకీయాల్లో కలిసి పని చేద్దామని పొంగులేటి పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు టిడిపి నేతలు మద్దతు పలికినట్టు టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News