Monday, December 23, 2024

ఏపిలో బిజెపితో టిడిపి, జనసేన పొత్తు ఖరారు

- Advertisement -
- Advertisement -

ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకుంటున్నాయి. దాదాపు ఆరేండ్ల తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిజెపితో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శనివారం రోజు ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని ఆయన నివాసంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. కాగా ఎపిలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించామని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు శుక్రవారం ఏపిలో వెల్లడించారు.

ఈ మేరకు ఢిల్లీలో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబా టు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చర్చలు జరిపారు. కాగా పొత్తుల్లో ఆ పార్టీలు అవగాహనకు వచ్చా యని, బిజెపి , జనసేన పార్టీలకు 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు టిడిపి అంగీకరించిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. మిగతాచోట్ల టిడిపి పోటీ చేసేలా అంగీకారం కుదిరినట్టు సమాచారం.బిజెపి ఐదు, జనసేన మూడు సీట్లలో పోటీ చేయనున్నట్టు తెలిసింది. అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట స్థానాల్లో బిజెపి,అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం సీట్లలో జనసేన పోటీచేయనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News