Sunday, January 19, 2025

4 లోక్‌సభ 9 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన ఏపి టిడిపి

- Advertisement -
- Advertisement -

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే టిడిపి అభ్యర్థుల మరో జాబితాను ఆ పార్టీ తాజాగా విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి 9 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది.లోక్‌సభ అభ్యర్థుల ఇలా ఉన్నారు. విజయనగరం- నుండి కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు నుండి -మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప నుండి
-భూపేష్ రెడ్డి, అనంతపురం- నుండి అంబికా లక్ష్మీనారాయణలు పోటీ చేయనున్నట్లు టిడిడి ప్రకటించింది. అలాగే ఏపి అసెంబ్లీ అభ్యర్థుల్లో చీపురుపల్లి- నుండి కళా వెంకట్రావు, భీమిలి- నుండి గంటా శ్రీనివాసరావు, పాడేరు నుండి -వెంకటరమేష్ నాయుడు , దర్శి నుండి -గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట నుండి -సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు- నుండి వీరభద్రగౌడ్, గుంతకల్లు నుండి -గుమ్మనూరు జయరామ్, అనంతపురం అర్బన్- నుండి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి- నుండి కందికుంట వెంకట ప్రసాద్‌ను ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News