Monday, December 23, 2024

తెలంగాణలో టిడిపి పోటీ: చంద్రబాబు నాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉమ్మడి ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో ఒంటరిగానే పోటికి వెళ్తామని, బిజెపితో కలిసి వెళ్లడానికి సమయం మించిపోయిందన్నారు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీపై కమిటీ ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరణ ఇచ్చారు. తెలంగాణలో తెలుగు దేశంలో పార్టీకి ఓటు బ్యాంకు అలాగే ఉంది. 2014 జిహెచ్‌ఎంసి ఎన్నికలలో టిడిపికి 13 శాతం ఓటింగ్ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి 3.51 ఓట్ల శాతంతో రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్రా వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చ నాగేశ్వర్ రావు గెలిచారు.  ఈ సారి టిడిపికి ఖమ్మం, హైదరాబాద్ నుంచి నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ ప్రముఖులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బిసి సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు కేటాయించే అవకాశం ఉందని టిడిపి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News