Tuesday, April 8, 2025

జూన్ లోగా నామినేటెడ్ పదవులు భర్తీ: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జూన్ లోగా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని సిఎం సూచించారు.  మంత్రులు, ఎంపిలు,  ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ చార్జులతో టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.  త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు ఉంటాయని తెలియజేశారు. కష్టపడిన నేతలు, కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. 2029 లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని కోరారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో బాగా పనిచేసిన వారికే పదవులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News